బక్రీద్: 'జంతుబలి' ఎందుకిస్తారో తెలుసా ?

VAMSI
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే హాజ్ యాత్ర చేయాలని ఇస్లాం సూత్రాలలో చెప్పబడింది. అంతే కాకుండా ఈ యాత్రకు ఓ కటిన నిబంధన కూడా ఉంది. యాత్రకు వెళ్లే వ్యక్తి కష్టపడి సంపాందించిన ధనాన్ని వినియోగించి మాత్రమే హాజ్ యాత్రకు వెళ్ళాలి. మానవత్వమే మనిషిని కాపాడుతుందని ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం పెంపొందాలన్నదే బక్రీద్ యొక్క ఆంతర్యం. ఇస్లాం ధర్మంలోని పెద్ద ప్రవక్త ఇబ్రహీం అని చెప్పబడింది. అయితే ఈ ప్రవక్తకు దాదాపు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు అల్లా  దయ వల్ల ఒక బిడ్డ జన్మిస్తాడు. తనకు ఇస్మాన్ అని నామకరణం చేస్తారు.  అయితే ఒక రోజున ప్రవక్త ఇబ్రహీంకు తన బిడ్డ ఇస్మాన్  మెడపై ఎవరో కత్తి పెట్టి నరకబోతున్నట్లుగా కల వస్తుంది. దాంతో అల్లా ఖుర్బానీ కొరకు ఎదురుచూస్తున్నాడు ఏమో అని ఒక జంతువును బలి ఇస్తారు. అయినా సరే మళ్లీ మళ్లీ ఇబ్రహీం కు అదే కల రాగా, అల్లా ఖర్భాని కోరుతున్నది జంతువుని కాదేమోనని తన బిడ్డ ఇస్మాన్ ను అని భావించి, ఇస్మాన్ ను బలి ఇచ్చేందుకు మనసును రాయి చేసుకుని సిద్దం అవుతారు ఇబ్రహీం. 

అయితే అలా బలికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అల్లా ఇబ్రహీం యొక్క భక్తి మెచ్చి అతని భక్తి గొప్పతనం గురించి ఈ లోకానికి తెలియ చెప్పమని అదే విధంగా ఇస్మాన్ కి బదులుగా ఒక జీవిని బలి ఇవ్వాలని ఒక దూత ద్వారా సందేశం పంపుతారు. ఇక అప్పటి నుండి ఖుర్బానీ ఒక ఆచారంలా వస్తుందని ముస్లిములు యొక్క విశ్వాసం. ఖుర్బానీ అనగా పేదలకు మాంసమును దానం ఇవ్వడం, వారికి సహాయపడటం మరియు త్యాగం చేయడం అనే అర్ధాలు చెప్పబడ్డాయి. అందుకే బక్రీద్ నాడు గొర్రె లేదా ఇతర జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని పేదలకు మరొక భాగమును బంధువులకు చివరి బాగాన్ని కుటుంబ సభ్యులకు వినియోగిస్తారు. ఇది ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమే.

బలిదానం అనేది ఇక్కడ రక్తం అల్లాకు చేరదని కేవలం తమ భక్తి మాత్రమే చేరుతుందని అందుకే ఆ బలిదానం ఇచ్చిన జంతువు మాంసాన్ని పేదలకు ఒక వంతు దానం గా ఇవ్వబడుతుందట. ఖుర్బానీ కి ఒంటె, మేక , లేక గొర్రెను వినియోగిస్తారు. ఖుర్బానీ కి కోడి పుంజును అస్సలు బలి ఇవ్వకూడదు. అయిదేళ్ళు పైబడినటువంటి ఒంటెను, రెండేళ్లు పైబడినటువంటి ఎద్దును లేదా ఒక ఏడాది వయసు ఉన్నటువంటి మేకను ఖుర్బానీకి వినియోగించాలి. ఎక్కువగా గొర్రెను ఖుర్బానీ కి ఉపయోగించాలని చెప్పబడింది. ఇలా ఖుర్బానీ గురించి ముస్లిముల చరిత్ర చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: