మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?
అనంతరం అర చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకుని "ఓం కేశవాయ నమః"...అని తాగేయాలి. మళ్లీ తీసుకుని "ఓం నారాయణాయనమః" అని తాగాలి. మళ్లీ తీసుకుని "ఓం మాధవాయ నమః" అని తాగాలి. కానీ నాలుగవసారి నీటిని అరచేతిలో పోసుకుని ప్లేట్ లో వదిలేయాలి. ఆ తర్వాత మీ పిల్లలతో నిత్య దీపారాధన చేయించాలి. దీపాన్ని నేరుగా అగ్గిపెట్టెతో వెలింగించరాదు. కాబట్టి హారతి పల్లెమును తీసుకుని అందులో వత్తి వేసుకుని ముందుగా ఆ వత్తిని వెలిగించి అనంతరం దాంతో నిత్య దీపాన్ని వెలిగించాలి. అనంతరం దీపం వద్ద అక్షింతలు వేసి నమస్కరించుకుని, ఆ సమయంలో ఇలా మంత్రం జపించాలి. "ఓమ్ శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే". ఓం గణేశాయ నమః అంటూ నమస్కరించుకోవాలి.
ఆ తర్వాత సరస్వతి దీపాన్ని వెలిగించాలి. "ఓం వాణి మనూ ప్రియే దేవి బ్రహ్మ అర్థ శరీరని సౌశీల్యం కురునే దేవ్ బ్రహ్మ పత్నే సరస్వతీ నమోస్తుతే' అని జపించి కాస్త పసుపు కుంకుమను దీపం వద్ద వేసి నమష్కరించుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః...అంటూ కడ్డీలు వెలిగించాలి. ఆ తర్వాత తమలపాకుతో నీటిని తీసుకుని దీపానికి తాకించి ఆ నీటిని ప్లేట్ లో వదిలేయాలి. అనంతరం నైవేద్యంగా తేనెను సమర్పించాలి. సరస్వతికి తేనె అంటే మహా ప్రీతి. అనంతరం తమకు మేధస్సును ప్రసాదించమని ఆ సరస్వతి దేవిని వేడుకోవాలి.