మనకు ఉన్నటువంటి పన్నెండు విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది పవిత్రమైనది. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ముఖ్యమైన మాసంగా అనాది కాలం నుండి పరిగణించబడింది. శ్రావణ మాసమును శుభ మాసము అని కూడా అంటుంటారు. ఈ మాసములో వచ్చేటటువంటి సోమ, శుక్ర, శని, మంగళ వారాలు ఎంతో పవిత్రమైన వారాలుగా చెప్పబడుతున్నాయి. శ్రావణమాసం ఈ సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం నాడు శివ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అందమైన మాసంగా శ్రావణ మాసమును చెప్పవచ్చు.
ఇక శ్రావణ మాసం ప్రారంభం కాబోతున్న తరుణంలో అమ్మవారి కరుణాకటాక్షాలు పొందడానికి ఈ వస్తువులు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. అవి ఏమిటో ఇపుడు చూద్దాం. అమ్మ వారికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి కనుక శ్రావణ మాసంలో తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో ఉంచి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇల్లు ఆర్థికంగా సంతోష కరమైన వాతావరణంలో స్థిరపడుతుంది. అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలను శ్రావణమాసంలో
తీసుకొచ్చి పూజ మందిరంలో ఉంచి పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పక లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అదే విధంగా లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అమ్మవారి పాదాలు, రుద్రాక్షలు మరియు శంఖు లను శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకొని పూజా మందిరములో ఉంచి పూజలు జరిగినట్లయితే అమ్మవారు ప్రసన్నం అవుతారని ఆ మాత ఆశీస్సులు అంది విశేషమైన లాభాలు అందుతాయని శాస్త్రములు చెబుతున్నాయి.
అంతే కాకుండా శ్రావణ మాసంలో నిత్యం ఇంటిని శుభ్రంగానే ఉంచుకోవాలి. బూజు వంటివి ఆస్సలు ఉండరాదు. నిత్యం తులసి కోట వద్ద దీపం వెలింగించాలి. ముఖ్యంగా సోమ, మంగళ, శుక్ర వారాలు తప్పకుండా దీపమెలిగించాలి.