ఈ వ్రతాలతో శ్రావణ లక్ష్మి మీ ఇంట్లోనే ?
అంతేకాదు వివాహాలు, శుభకార్యాలు,నూతన వ్యాపార ప్రారంభాలు ఇలా అన్ని మంచి పనులను ఈ మాసంలో చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మి ల అనుగ్రహానికి పాత్రులై శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక శ్రావణ మాసంలో మహిళలు ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శుక్ల పక్ష పౌర్ణమి, నాగ పంచమి, కృష్ణాష్టమి వంటి అత్యంత పవిత్రమైన విశిస్టమైన పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటుటారు. ప్రతి పూజ దేనికదే ప్రత్యేకం. ఈ మాసంలో చేసేటటువంటి ఏ పూజనైనా సరే భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేస్తే మంచి ప్రతి ఫలితాలు తప్పక మీ సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతం వివాహితలకు ఎంతో ముఖ్యమైనది. వారి పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా కాపాడి మాంగళ్య బలం మరింత పటిష్టంగా మారేందుకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కావున పెళ్ళైన స్త్రీలు తప్పకుండా ఈ రెండు వ్రతాలను చేయుట మంచిదని అంటున్నారు...