గ్రామ దేవతలకు జంతుబలి ఎందుకు ఇస్తారో తెలుసా..?

Divya
గ్రామదేవతలకు జంతువులను బలి ఇవ్వడం అనే సంప్రదాయం నేటిది కాదు. గత కొన్ని శతాబ్దాల కింద నుంచి ఈ పద్ధతిని పెద్దవాళ్ళు అనుసరిస్తున్నారు. అమ్మవారికి జంతువులు బలిbఇవ్వడం వల్ల అమ్మవారు శాంతిస్తుంది అని , కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని నమ్మకం. ఈ జంతుబలులు ఇవ్వడం అనే సందర్భం వెనుక దాగి ఉన్న ఒక రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గాలి ,నీరు ,నేల , ఆకాశం , నిప్పు అలాగే సూర్యచంద్రులను మనం మహాశక్తులు గా భావించి, వారిని పూజిస్తూ వస్తున్నాము. అంతేకాదు వీరు సంతృప్తి పడేలా పూజలు చేసి , ప్రసాదాలు అర్పించి, వరాలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారు అనే నమ్మకం ప్రజల నాటుకుపోయింది. అందరూ భాగంగానే  పుట్టుకొచ్చింది ఈ జంతు బలి. ఇటీవల కాలంలో హేతువాదులు జంతువులను, అమ్మవారికి జంతుబలి ఇవ్వకూడదని , అది అనాగరికత అని చెప్పుకొస్తున్నారు. అయితే మనం జంతుబలులు ఇవ్వవచ్చా అనే విషయంపై హేతువాదం ఏం చెబుతోంది..?  అసలు గ్రామ దేవతలకు జంతు బలులు ఎందుకు ఇవ్వాలి..? అనే విషయాల గురించి చర్చించుకుందాం.

హిందూ శాస్త్రం ప్రకారం సంస్కృతంలో బలి అంటే ఇవ్వడం అని అర్థం. దీవి దేవతలకు , భూత గణాలకు ఇచ్చే ప్రసాదాన్ని బలి అని అంటారు. సాధారణంగా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాచీన ఆలయాలలో ఏ ఆలయానికి వెళ్ళినా, ఆలయం చుట్టుపక్కల చిన్న చిన్న రాళ్ళ కట్టడాలు నిర్మించి ఉంటారు. ఈ రాళ్లపైన పెసరపప్పు కానీ పెరుగన్నము కానీ తీపి పదార్థాలు కానీ ఉంచడం మనం గమనిస్తూనే ఉంటాం. అంటే మనిషి కడుపు నింపుకోవడానికి ఆహారం ఎంత అవసరమో పంచ గణాలకు ఆహారాన్ని ఇవ్వడం కూడా అంతే అవసరం అన్నట్టుగా వీటిని అక్కడ పెడుతూ ఉంటారు.
అంటే, భూమిపై ఉన్న జీవకోటిరాసికి కడుపు నింపడం కోసమే పెద్దవాళ్ళు ఈ ప్రసాదాన్ని సమర్పణగా ఇవ్వాలి అని , దీనిని బలి అనాలని అందరికీ సూచించారు. ఈ జంతుబలులు ఎందుకు ఇస్తారు..అనే విషయానికి వస్తే, కోడికి భయపడే గుణం ఉంటుంది.. గొర్రెకు గుడ్డిగా ఎవరినైనా నమ్మే స్వభావం ఉంటుంది. ఇక మేకకు మూర్ఖత్వం ఎక్కువ.. ఇలాంటి దుర్గుణాలు కలిగిన జంతువులను అమ్మవారికి బలి ఇవ్వడం వల్ల , ఇలాంటి దుర్గుణాలు మనకు ప్రసాదించకుండా సద్గుణాలను ప్రసాదించి, ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో దీవిస్తారని,  భక్తులు వేడుకుంటూ ఉంటారు.

సాధారణంగా కొన్ని కొన్ని ద్రవ్యాలతో భగవంతుని కొన్ని సంవత్సరాల పాటు పూజించడం వల్ల మనలో ఉన్న అవలక్షణాలు పోయి, మంచి సద్గుణాలు లభిస్తాయని వేదాలలో చెబుతోంది. అయితే వీటికి షార్ట్కట్ రూపంలో వచ్చినవి ఈ జంతుబలులు. అందుకే ఈ జంతుబలులు ఇచ్చి , మనలో అన్ని మంచి లక్షణాలు చేకూరాలని అమ్మవార్లకు జంతుబలులు ఇస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: