కృష్ణాష్టమి: ఈ రోజు చేయాల్సిన పనులివే ?

VAMSI
శ్రీ కృష్ణుని జన్మదినం అయిన ఈ రోజు భక్తులంతా ఎంతో పరమపవిత్రముగా భావిస్తారు. హిందువులకు ఉన్న అనేక పండుగలలో ఇది కూడా ఒకటి. అన్ని పండుగలకు ఎలా పూజించాలి అని కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ రోజు అంతా ఆ శ్రీ కృష్ణుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. పండితులు ఈ రోజు ఆచరించాల్సిన కొన్ని నియమాలను గురించి ఈ విధంగా చెబుతున్నారు.
ఈ శుభ దినాన భక్తులంతా పొద్దున్నే స్నానం ఆచరించి పూజ అయ్యే వరకు ఉపవాసాన్ని ఆచరించవలెను. పూజకు ముందుగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
కొందరేమో పగలంతా ఉపవాస దీక్ష చేసిన అనంతరం సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు.
ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తున్న కారణంగా ఈ కృష్ణాష్టమికి మరింత ప్రత్యేకత చేకూరుతుంది. ఈ మాసంలో మనకు లభించే పండ్లు, అటుకులు మరియు బెల్లం కల గలిపిన వెన్న పెరుగు మీగడలను శ్రీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీకృష్ణుడికి పలు, మీగడ వెన్న అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఈ రోజున శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని ఒక ఊయల చేసి అందులో పడుకోబెట్టాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఆయన పాటలు మరియు కీర్తనలు పాడుతూ ఆయనను నిద్ర పుచ్చాలి.
ఈ రోజున సాయంత్రం సమయంలో ఉట్టి కట్టి చాలా సరదాగా జరుపుకుంటారు. ఇందులో ఊరు ఊరంతా పాల్గొని సంతోషంగా జరుపుకుంటారు.
ఈ రోజున లేని వారికి దానం చేయడం శ్రేష్టం. ఈ రోజున శ్రీ కృష్ణ జయంతి వ్రతాన్ని చేయాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ రోజున కొంత సమయం శ్రీకృష్ణుని భాగవతం గ్రంధాన్ని పఠించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
కనీసం భాగవతం నుండి ఏ రెండు మంచి పనులను మీరు ఆరోజు నుండి మీ జీవితంలో భాగంగా చేసుకోవాలని పెద్దలు అంటున్నారు.
ఇలా శ్రీ కృష్ణుని జనాంధీనం కృష్ణాష్టమిని జరుపుకోండి. మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. జై శ్రీ కృష్ణ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: