బతుకమ్మ పండుగ స్పెషల్ : సాంప్రదాయాలకు కొలువు బతుకమ్మ తల్లి పండుగ..!
అలాంటి సంస్కృతికి అద్దం పట్టే ఒక పాట.." కలవారి కోడలు ఉయ్యాలో.." కనకమహాలక్ష్మి ఉయ్యాలో.." అంటూ సాగే ఈ పాట వివరణ తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే పెళ్లిళ్లు అయినా ఆడవారు పుట్టింటికి వెళ్ళాలి అంటే కేవలం భర్త అనుమతి మాత్రమే తీసుకుని వెళుతూ ఉంటారు .. అంతేకాదు పెద్ద కుటుంబాలలో జీవించడానికి అస్సలు ఇష్టపడరు.. కానీ కలిసి ఉంటే కలదు సుఖం అని చెబుతుంది ఈ పాట. ఆ కాలంలో ఎవరైనా సరే ఆడవారు పుట్టింటికి వెళ్లాలంటే మాత్రం మామ తో మొదలుకొని ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ కచ్చితంగా అనుమతి తీసుకున్న తర్వాతనే తమ పుట్టిన ఇళ్లకు వెళ్లేవారు..
ఇక ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుండి తన అన్న, తన చెల్లెలును బతుకమ్మ పండుగ కోసం తమ ఇంటికి తీసుకురావడానికి చెల్లెలు మెట్టినింటికి వెళ్తాడు.. అన్నయ్య ని చూడగానే ఆ చెల్లి ఆనంద భాష్పాలను వెదజల్లుతుంది.. బట్టలు సర్దుకోఅమ్మ ఇంటికి వెళ్దాము అనగానే లేదు అన్నయ్య మామగారిని, అత్త గారిని అడగాలి అంటూ ఇంట్లో ఉన్న పెద్ద బావ గారిని ,అక్కను చివరికి తన భర్తను కూడా అడిగి ఆమె భర్త సలహా మేరకు తన అన్నతో ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది.పుట్టింటికి శుభప్రదంగా వెళ్లి మెట్టినింటికి క్షేమంగా రమ్మని చెబుతాడు ఆమె భర్త.. ఇలా ఈ పాటలో ఎంత సారాంశం ఉంది అంటే నాటి కాలమైన నేటి కాలమైన సాంప్రదాయాలను ఎవరు విడనాడకూడదు అని సంస్కృతికి ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాలని నేర్పుతుంది.
బతుకమ్మ పండుగకు అక్కా చెల్లెమ్మలు, ఆడపడుచులు ఇలా ప్రతి ఒక్కరు అంగరంగవైభవంగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని పెద్దలు పెట్టిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. తంగేడు పూలతో.. వివిధ రకాల పూలు తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి, పూజ చేసి ,పాటలు పాడి, నైవేద్యం సమర్పించి చివరికి నీటి నిమజ్జనం చేస్తారు. ఈ పాట విడుదలై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంది.. ఇంట్లో అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో ఇంతకంటే గొప్పగా ఎవరు వివరించలేరేమో..