ఈ నవరాత్రులలో అమ్మవారు మెచ్చే నైవేద్యాలు ఇవే..!
చిట్టి గారెలు: వీటిని మాష చక్రములు అని కూడా అంటారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మినుములతో తయారుచేసే ఈ చిట్టి గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పంచుకుంటే అమ్మవారు ఇష్టంగా స్వీకరిస్తారట.
కట్టె పొంగలి : బియ్యం, పెసరపప్పు ,జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఉపయోగించి చేసే కట్టె పొంగలి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. ముఖ్యంగా భవానీదేవి కి కట్టె పొంగలినీ నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు అని పెద్దలు చెబుతున్నారు.
దద్దోజనం: పెరుగు అంత చల్లగా అమ్మవారు ఆశీస్సులు భక్తులపై ఉంచాలని ప్రతీకగా అమ్మవారికి దద్దోజనం ప్రసాదిస్తూ ఉంటారు. పెరుగు అన్నం తో చేసే ఈ దద్దోజనం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట.
నువ్వులన్నం: నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ నువ్వుల అన్నాన్ని వండుతారు. అసురులతో పోరాడే కాళికాదేవికి నువ్వులలో ఉండే విష్ణు శక్తి తోడవ్వాలని ఇలా చేస్తారు.
చిత్రాన్నం /పులిహోర/హరిద్రాన్నం:
పోపు గింజలు, నిమ్మకాయ కలిపి చేసే ఈ చిత్రాన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో మనం వెళ్ళిన ప్రతిసారి చిత్రాన్నం లేదా పులిహోరను ప్రసాదంగా భక్తులకు పంచుతూ ఉంటారు పూజారులు.
గుడాన్నం : పెసరపప్పు, బియ్యం ఉడకబెట్టి అందులో బెల్లం, నెయ్యి, సుగంధ ద్రవ్యాల పొడి, ఎండు ఫలాలను వేసి ఈ గుడాన్నం తయారు చేస్తారు.
శాకాన్నం:
తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధద్రవ్యాల పొడులు వేసి అమ్మవారికి అన్నం వండి నైవేద్యం గా సమర్పిస్తారు.
ఈ నవరాత్రులు అమ్మవారికి ఇలా ప్రసాదాలు చేసి సమర్పించడంవల్ల అమ్మవారు ప్రసన్నం చెంది మనకు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను సిద్దిస్తుందట.