దుర్గాష్టమి: ఉపవాస దీక్షలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా..?
ఈ రోజు ఉపవాస దీక్షలో భాగంగానే కాల్చిన బంగాళాదుంపలు, తాజా పండ్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి. డీ ఫ్రైడ్ స్నాక్ తో పాటు అధిక షుగర్ పదార్థాలను తినకూడదు. ఇకపోతే మీరు ఒకేసారి కడుపునిండా తినకుండా మీరు తీసుకోవాలనుకున్న ఆహార పదార్థాలను ఆరు భాగాలుగా విభజించి ప్రతి 60 నిమిషాలకు ఒకసారి తీసుకోవడం మంచిది. అమ్మవారి దీక్ష లో ఉన్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉపవాసం చేయడం వల్ల శక్తిని కోల్పోయి అమ్మవారిపై ధ్యాస తప్పి , మన కడుపు పైనే ధ్యాస ఉంటుంది కాబట్టి తక్కువ మొత్తంలోనే తాజా పండ్లను తీసుకోవాలి.
మీరు ఉపవాసం చేసేటప్పుడు తక్కువ మొత్తంలోనే ఆహారాలను సేవిస్తూ శరీరానికి శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్, వాల్నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా మిల్క్ షేక్ లాంటివి తీసుకోవచ్చు. దీక్ష లో భాగంగానే ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు పలుచటి మజ్జిగ, కొబ్బరినీళ్లు , మంచి నీటిని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి లేదా ప్రతి అరగంటకు ఒకసారి కొద్దిగా సిప్ చేస్తూ ఉండాలి.
ఈ నవరాత్రులలో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉపవాసాలకు దూరంగా ఉంటేనే మేలు అని చెబుతున్నారు వైద్యనిపుణులు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఉపవాసం చేయాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు పండితులు.