త్రయోదశి తిథి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
ఈ పండుగను చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ప్రజలు ఈ రోజున బంగారు ఆభరణాలు, బట్టలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఆరోజూ చేయాల్సిన, చేయకూడని పనులను తెలుసుకోండి.
ఏం చేయాలి?
ఈ రోజు పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి.
చెత్తను ప్రతికూల శక్తికి కేంద్రంగా భావిస్తారు. కాబట్టి దానిని పారవేయండి.
ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయాలి.
కుటుంబంలో ఎలాంటి అకాల మరణాలు జరగకుండా ఉండాలంటే ఇంటి బయట దీపం వెలిగించాలి.
పంచాంగంలో పేర్కొన్న శుభ ముహూర్తంలో మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయండి.
ఏమి చేయకూడదు?
మట్టి లేదా వెండి విగ్రహాలను పవిత్రంగా భావిస్తారు. కాబట్టి గాజు లేదా ఇతర విగ్రహాలను పూజించవద్దు.
ఇది లక్ష్మీ దేవిని స్వాగతించే పండుగ, కాబట్టి ఇంటి ప్రవేశద్వారం వద్ద బూట్లు, చెప్పులు ఉంచవద్దు.
ఈ రోజున అప్పు చేయకూడదని నమ్ముతారు.
ఇంట్లో ప్రతికూల ఆలోచనలు వ్యాపించకుండా పూజా కార్యక్రమాలు సంతోషంగా చేయాలి.
ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి.