మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా.. లేదా..?
నిజానికి గర్భవతిగా ఉన్న మహిళ మూడు నెలలు దాటితే.. ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయకుండా, కొత్త నిర్మాణాలు వంటివి చేపట్టకూడదు. ఒకవేళ ఏదైనా ఇల్లు నిర్మించి మధ్యలో ఆగిపోయిన.. వాటిని మొదలుపెడితే గర్భంలో ఉండే శిశువుకు పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని కొంతమంది పండితులు సూచిస్తున్నారు.
గర్భవతులైన స్త్రీలు పూజలు చేయవచ్చా లేదా అనే విషయంపై కొంతమంది అనేక సలహాలు ఇవ్వడం జరుగుతోంది. కాని శాస్త్రం ప్రకారం గర్భిణి అయిన స్త్రీ తేలికపాటి పూజను నిర్వహించుకోవచ్చు. కానీ కానీ టెంకాయ వంటివి మాత్రం కొట్టకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గుడి చుట్టూ ప్రదర్శనలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, కొత్త పూజలు వంటివి ప్రారంభించకూడదని తెలియజేస్తున్నారు. ఒకవేళ వీరు దేవుడి ముందర ధ్యానం వంటివి చేయవచ్చు అని కొంతమంది చెబుతున్నారు.
గర్భవతులలో ఇలాంటి నియమం విధించడం వల్ల వారికి రాబోయే పలు ఇబ్బందుల నుంచి రక్షిస్తుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు 5 మాసం వచ్చే వరకు వ్రతం చేయవచ్చని, ఆ తరువాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజ గది దగ్గరకు కూడా రాకూడదని శాస్త్రం తెలియజేస్తోంది. ఏదైనా కొండ మీద ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళకూడదట. అలా వెళ్లడం వల్ల మీరు ఏదైనా ప్రమాదంలో పడవచ్చని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు.