దేవాలయం పక్కన మీ ఇల్లు ఉందా.. అయితే ఇక..!

Divya
మనం ఎక్కువగా వాస్తు శాస్త్రాలని నమ్ముతూ ఉంటాము. మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు, కొన్ని వస్తువులను ఎక్కడ ఉంచాలో అన్నప్పుడు మనం ఎక్కువగా శాస్త్రాలను పాటిస్తూ ఉంటాము. ఇదంతా ఇలా ఉండగా,మన ఇల్లు ఏదైనా దేవాలయం దగ్గర లో ఉన్నట్లు అయితే.. ఆ దేవాలయం నీడ మన ఇంటి మీద పడినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన చుట్టూ ప్రదేశంలో ఏదైనా దేవాలయం ఉన్నప్పుడు ఆలయంలో నుంచి వెలువడే గంటల శబ్దం, సుగంధపు వాసన, ఇవన్నీ కలిసి మనిషికి ఎంతో సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం గుడి పక్కల ఇల్లు వంటివి నిర్మించుకుంటే అది ఆ ఇంటిల్లిపాది ఆనందం ఇస్తుంది కానీ, అది అలా ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందో తెలియదు అంటున్నారు కొంతమంది వాస్తు నిపుణులు. వాస్తవానికి దేవాలయాల పవిత్రమైన స్థలము. అందుచేతనే ఆ సరౌండింగ్ లో ఎలాంటి ఇల్లు నిర్మాణం చేయవద్దని పండితులు తెలియజేస్తున్నారు.
అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, గొడవలు ఎక్కువగా జరుగుతాయని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా దేవాలయం నీడ మీ ఇంటిపైన పడినట్లయితే.. మీరు ప్రతి రోజూ వెళ్లి అక్కడి ఉండే దేవతలను ప్రార్థన చేసుకోవాలట. అలా చేయడంతో పాటు ఏదైనా అమావాస్య, పౌర్ణమి రోజున దేవుడికి నైవేద్యం కూడా సమర్పించాలట. దాంతో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ దేవుని ఆలయం కంటే మీరు కొద్దిగా దూరం ఉన్నట్లయితే మీకు అన్ని ప్రయోజనకరమైన పనులు జరుగుతాయట.

అయితే నిజానికి గుడి ఆవరణ స్థలంలో కానీ, గుడి నీడ పడే స్థలంలో కాను ఇంటి నిర్మాణం చేపట్టకూడదని పూర్వం నుంచే ఈ పద్ధతి ఉన్నదట. ముఖ్యంగా ఆడ దేవత సమీపంలో ఇంటిని నిర్మిస్తే ఊహించని విధంగా కొన్ని వివాదాలు తలెత్తుతాయట. అందుచేతనే వీలైనంత వరకు దేవాలయాల సమీపంలోని ఇంటి నిర్మాణానికి దూరంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: