మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే.. ఈ తప్పులు చేయకండి..!!

Divya
మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఏ పని చేయాలన్నా అది డబ్బుతో ముడిపడి ఉంటుంది.. డబ్బే అన్నింటికీ కారణం కనుక డబ్బు లేనిదే ఏమి చేయలేము అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.. కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే మరి కొంత మంది దగ్గర డబ్బులు నిలబడవు. సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఖర్చు పెడుతూ ఉండడంవల్ల ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.వీటన్నింటికీ వాస్తు దోషం అని చెబుతున్నారు వాస్తు పండితులు. ఏంటి షాక్ అవుతున్నారా..? నిజమే .. వాస్తు దోషం వల్ల కూడా ఇంట్లో డబ్బు నిలబడదట.

వాస్తు ప్రకారం.. మీ ఇంటి నిర్మాణం లేకపోతే ఆ ప్రభావం ధనంపై చాలా ఉంటుంది.. అందుకే ఈ సమస్య వల్ల ఇంట్లో డబ్బు నిల్వక ఉండకపోవడం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం తో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకు లభించదట. లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే కొన్ని కారణాలు ఉంటాయట.అవేంటో ఇప్పుడు చూద్దాం..
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కార్యాలయంలో లేదా ఇంట్లో మురికి ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి అశుభ్రమైన ప్రదేశానికి ప్రవేశించదు కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాలు అలాగే మన ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత కటాక్షిస్తుందట.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెప్పులు, బూట్లు వంటివి  విడవకూడదు. అంతే కాదు పూజా మందిరం వద్ద చెప్పులు తీసుకెళ్లకూడదు. ఇంట్లో ఉపయోగించే చీపురుని బహిరంగ ప్రదేశాలలో పెట్టరాదు .అంతే కాదు ఎవరు పడితే వారు ముట్టుకోరాదు.. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎల్లప్పుడు చీపురును ఇంట్లో దాచి పెట్టాలి. అంతే కాదు ఇంటిలో పాడైపోయిన కుళాయిలు, పెద్ద గడియారాలు వంటివి కూడా వాస్తు దోషాలను సృష్టిస్తాయి. వీటివల్ల లక్ష్మీదేవి కటాక్షించదు. ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రాకూడదు.
అతని చేతిలో ఏదో ఒకటి కచ్చితంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు ఎవరిమీద కోపం చుపించరాధు. ఇతరుల పట్ల చెడుగా భావించకూడదు. ఇవన్నీ పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: