నేడు గీతా జయంతి..ఎలా వచ్చిందంటే..?

Divya
హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయులు ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత పుట్టిన రోజు అని శాస్త్రం చెబుతోంది. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత.. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కృష్ణుడు స్వయంగా అర్జునుడికి వెల్లడించిన రోజు ఈ రోజే అని శాస్త్రం నమ్ముతోంది.. అందుకే ఈ రోజు అనగా మార్గశిర మాసం యొక్క 11 వ రోజు అయినటువంటి శుక్ల ఏకాదశి నాడు మనం భగవద్గీత జయంతి జరుపుకుంటాము.
కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీమహావిష్ణువు కృష్ణావతారం లో ఉండి యుద్ధ భూమి మీద అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందుకే నేడు గీతాజయంతి ని చాలా అద్భుతంగా మహోత్సవంలా జరుపుకుంటారు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు కౌరవులకు ,పాండవులకు మధ్య సయోధ్య కోసం ఎంతో మంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ .. విఫలమైన తర్వాత యుద్ధం అనివార్యమైంది.. ఇక తన ప్రాణ స్నేహితుడు అలాగే భక్తుడు అయినటువంటి అర్జునుడి పట్ల స్వచ్ఛమైన కరుణ..  హృదయ  పూర్వక మైనటువంటి ప్రేమతో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు రథసారధిగా మారాలని నిర్ణయించుకుంటాడు.
యుద్ధ సమయం రానే వచ్చింది. ఇక ఆ రోజు అర్జునుడు ప్రత్యర్థి దళాలను మరింత క్షుణ్ణంగా చూడడానికి..సేనల మధ్య యుద్ధభూమి మధ్యలోకి రధాన్ని తీసుకెళ్ళమని శ్రీకృష్ణుడిని కోరుతాడు. అయితే తన తాత అయినటువంటి భీష్ముడు ఎదురుగా యుద్ధానికి కౌరవుల వైపు రావడం తో.. అతని హృదయం తీవ్రంగా దుఃఖిస్తుంది. ఇక అర్జునుడి మనసు గందరగోళంలో పడటంతో పాటు శరీరం కూడా తీవ్రంగా వణుకుతోంది. ఇక తాత భీష్ముడిని  చూసిన సమయంలో తీవ్ర దుఃఖంతుడైన అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించలేక పోతాడు. అంతేకాదు ఈ యుద్ధంలో తన బంధువులను, గౌరవనీయమైన వ్యక్తులను, స్నేహితులను, అమాయకులను ఇలా అందరినీ చంపవలసి వస్తుందనే ఆలోచనతో అర్జునుడు ఇంకా బలహీనంగా మారడంతోపాటు అనారోగ్యానికి కూడా గురి అవుతాడు.
ఈ సమయంలో యుద్ధభూమిలో గెలవాలి అంటే తనకు ధైర్యం కావాలని.. ఏదైనా సలహా ఇవ్వమని కృష్ణుడిని అర్జునుడు కోరతాడు. అప్పుడు అర్జునుడు.. శ్రీకృష్ణుడికి సలహాలు, సందేశాలతో కూడిన ఆదేశాలను భగవద్గీత రూపంలో చెప్పడం జరుగుతుంది. యుద్ధభూమిలో తన మన అనే తేడా లేకుండా అన్యాయం చేసిన ఏ ఒక్కరైనా సరే శిక్షకు అర్హులే అని భగవద్గీత చెప్పినట్టు శ్రీకృష్ణుడు బోధనా రూపంలో అర్జునుడికి తెలియజేస్తారు. ఇక అలా భగవద్గీత పుట్టుకొచ్చిందని ఆ రోజు నుంచి హిందువులు భగవద్గీతను అత్యంత పుణ్యప్రదమైన గ్రంథంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: