నిజమైన దేవుడు యేసు జననం వెనుకున్న రహస్యం ఇదే?

VAMSI
క్రిస్టియన్లకి క్రిస్మస్ అనేది అతి పెద్ద పండుగ అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏటా వారు కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరితో కలిసి డిసెంబర్ 25 న ఉన్నంతలో ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో క్రిస్మస్ సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్స్ అంతా కూడా క్రిస్మస్ ను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రముఖంగా ప్రతి చర్చ్ రంగు రంగుల స్టార్స్ తో అలంకరణతో వెలిగి పోతాయి. భక్తులంతా చర్చలకు చేరుకుని ముందు రోజు అర్ద రాత్రి నుండే ప్రార్దనలు చేస్తారు.
డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగకు ఎందుకు జరుపుకుంటారు అంటే ? దాని వెనుక ఒక కథ ఉంది. ఆ వివరాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం. క్రిస్టియన్లకు ఆరాధ్య దైవం అయినటువంటి ఏసు క్రీస్తు డిసెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ మహా లోక నాయకుడు జన్మదినాన్ని క్రిస్మస్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. యేసు క్రీస్తు పుట్టుకకు కూడా ఒక పెద్ద కథ ఉన్నది. ఆయన గొర్రెల పాకలో జన్మించారు. యూరప్‌లోని రోమన్ రాజ్యంలో నజరేతు అనే పట్టణంలో ఉండేటటువంటి మేరీకి, జోసెఫ్‌కు వివాహం నిశ్చయంకాగా ఒక రోజు గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి .. నీవు కన్యగానే గర్భం దాలుస్తావు నీకు మగ సంతానం లభిస్తుందని చెబుతాడు.
అలా కలిగిన ఆ మగ బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని, ఆయన దేవుడి కుమారుడని.. చెబుతాడు.  ఏసు అనగా కాపరి, రక్షించేవారు అని అర్థం. అయితే దేవదూత చెప్పినట్లుగానే మేరీ గర్భం దాలుస్తుంది. ఈ విషయం తెలిసి  జోసెఫ్ మేరీని వివాహం చేసుకొని దేవదూత ఆయన కలలో కూడా కనిపించి విషయాన్ని చెప్పి ఆమెను వివాహం చేసుకోవాలని చెబుతారు. అలా వారి వివాహం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: