అంత్యక్రియల తరువాత వెనక్కి తిరిగి చూడొద్దు... ఎందుకు ?
గరుడ పురాణం ప్రకారం శరీరాన్ని కాల్చేసిన తరువాత ఆత్మ దగ్గరి బంధువు ల పట్ల ఆకర్షితులై వారితో తిరిగి వెళ్లాలనుకుంటుంది. అటువంటి పరిస్థితిలో బంధువులు వెనక్కి తిరిగి చూస్తే, వారు ఇప్పటికీ ఆ వ్యక్తితో అనుబంధంగా ఉన్నారని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆత్మ కు అనుబంధం నుండి విముక్తి పొందడం సులభం కాదు. అందుకే అంత్యక్రియల తరువాత ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేయడం ద్వారా ఆత్మకు ఇప్పుడు ఆ బంధం నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది.
దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆత్మ తన బంధువులను అనుసరిస్తుందని, శరీరం కోసం వెతుకుతుందని కూడా ఒక నమ్మకం ఉంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే ఆత్మ ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుందట.