సంక్రాంతి వచ్చిందే తుమ్మెద..సరదాలు తెచ్చిందే తుమ్మెద.. కోడీ పందాలతో.. ఇలా చెప్పుకుంటూపోతే సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంక్రాంతి పండుగ అంటే ముంగిట్లో రంగురంగుల రంగవల్లులు.. వాటిపైన ఆవు పేడతో నవధాన్యాల తో నింపిన గొబ్బెమ్మలు.. తంగేడు పూలు.. పిల్లల తలపై భోగి పండ్లు.. రుచికరమైన పిండి వంటలు.. గంగిరెద్దులు.. నారదులు.. కొత్త బట్టలు.. పిల్లల పెద్దల కోలాహలం అబ్బో ఇలా ఎన్నో సంబరాలతో సంక్రాంతి పండుగను మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తారు.
సంప్రదాయబద్ధంగా చేసే ప్రతి పనిలోనూ సైన్స్ దాగి ఉందని చాలా మందికి బహుశా తెలియదనే చెప్పాలి.. సాంప్రదాయాన్ని నమ్మని హేతువాదులు కూడా ఉంటారు..అలాంటి వాళ్ళు ఈ భోగి పండుగ రోజున పిల్లల తలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనే విషయం పై ఆరా తీయగా కొన్ని విస్తుపోయే నిజాలు తెలిపినట్లు సమాచారం.. ఇకపోతే భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు ఏం జరుగుతుంది అనే విషయం గురించి సైన్స్ ఏం చెబుతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా సంక్రాంతి భోగి పండుగ తో మొదలవుతుంది.. భోగి తో భోగభాగ్యాలను ప్రజలు తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఇక గోదాదేవి రంగనాథుడిని వివాహం చేసుకున్నది కూడా ఈ భోగి రోజునే.. ఇకపోతే భోగి పండుగ రోజు రేగు పండ్లను తలపైన పిల్లలకు పోస్తారు.. సాంప్రదాయం ప్రకారం ఇలా ఎందుకు పోస్తారు అనే విషయానికి వస్తే పిల్లల పై ఉండే చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడు అనుగ్రహం పిల్లలకు లభిస్తుంది అని పెద్దలు భావిస్తారు.. ఇక సైన్స్ ఏం చెబుతోంది అంటే.. తల పైభాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుంది.. భోగి పండ్లను పోసినప్పుడు బ్రహ్మ రంధ్రాన్ని ఈ భోగిపండ్లు ప్రేరేపితం చేస్తే.. పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని రుజువయింది.
రేగు పండు మాత్రమే కాదు చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కూడా భోగి పండ్లుగా ఉపయోగిస్తారు.. ఇక వాడుకలో ఉన్న మరొక విషయం ఏమిటంటే రేగుపండ్ల కు బధరీ ఫలాలు అని పేరు కూడా ఉంది. మహా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణ లిద్దరూ బదరికావనంలో తపస్సు చేస్తూ ఉండగా.. వారి తల మీద ముక్కోటి దేవతలు బదరీ ఫలాలను కురిపించారు.. ఈ విషయం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతలో కూడా ప్రస్తావించడం గమనార్హం. ఇక ఆనాటి నుంచి నారాయణుడికి ప్రతీకగా పిల్లలను భావించి.. భోగి పండుగ రోజున ఈ సంప్రదాయం ఏర్పడింది అని చెబుతున్నారు.. అంతేకాదు రేగు పండ్లు ఎరుపురంగులో ఉంటాయి కాబట్టి సూర్యుడికి ప్రతీకగా వీటిని పిల్లల తలపై పోయడం శ్రీ సూర్యభగవానుడు ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని అని పెద్దలు చెబుతున్నారు.