భక్తి: పూజ అనంతరం ధూపం ఎందుకు వేస్తారో తెలుసా..?
ప్రతిరోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత కర్పూరం, లవంగం ధూపం వేయాలని చెబుతున్నారు. అయితే చేయడం వల్ల ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయని నమ్ముతుంటారు. అంతేకాదు.. వాటిపై ఉండే క్రిములు నాశనం అవుతాయని.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రతికూల శక్తులు ఏవి ఇంట్లోకి ప్రవేశించలేవు అని చెబుతుంటారు.
చాలా వరకు అందరి ఇండ్లలో గుగ్గిలం ధూపం ఎక్కువగా వేస్తుంటారు. ఇది మంచి సువాసనాని వెదజల్లుతుంది. గుగ్గిలం ధూపం వేయడం వలన గృహ వివాదాలను శాంతింపజేస్తుందని తెలిపారు. ఇంట్లో ఎవరైనా మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారికి దీని వాసన ఉపశమనం కలిగిస్తుందని అందరి నమ్మకం. ఇంట్లో గుగ్గిలం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అందుకే ఆలయాల్లో ఎక్కువగా గుగ్గిలం ఉపయోగిస్తుంటారు.
అలాగే గుగ్గిలం, గంధం, జటామంసి, సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, కస్తూరి వంటి పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి దశాంగ్ ధూపం వేస్తుంటారు. ఈ ధూపం వేయడం వలన ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొని రోగాలు నశిస్తాయని నమ్ముతుంటారు. ఇక వేప బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని నమ్ముతుంటారు. అంతేకాదు.. వేప ఆకుల ద్వారా తయారు చేసిన ధూపం వేయడం ద్వారా ఇంట్లో దాగి ఉన్న అన్ని రకాల క్రిములు చనిపోతాయని చెబుతుంటారు. ఇక హానికరమైన దోమలు, కీటకాలు నశిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో రోగాలు దూరమవుతాయని అందరు విశ్వసిస్తుంటారు.