హిందూ పురాణం ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజునే అమావాస్య అని అంటారు. అంతేకాదు ఆ రోజు ఎలాంటి పనులు చేపట్టిన సఫలీకృతం కావని అందరి విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిలో చంద్రుడు కలిసి పోతాడు కాబట్టి ఆ రోజు రాత్రి చీకటి ఏర్పడుతుంది. అమావాస్య రోజు విశ్వబ్రాహ్మణేతరులు శనిదేవున్ని కూడా పూజిస్తారు. అమావాస్య రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని అలా చేస్తారు.
పితృదేవతలు మన మంచిని కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజు వారికి పిండ ప్రధాన పూజ చేయడం చాలా మంచిది. మన ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసుకొని పితృ దేవతలకు భోజనాన్ని నైవేద్యంగా పెట్టి, తర్వాత ఆ భోజనాన్ని కాకులకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల అమావాస్యరోజు కాకుల రూపంలో మన పితృదేవతలు మనం పెట్టిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకంగా పెద్దలు చెబుతుంటారు. అసలు అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పడుకోకూడదు. అలా పడుకున్న వారి వద్దకు దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. మరియు అమావాస్య రోజు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. అలాగే కొత్త బట్టలకు పసుపు పెట్టకూడదని పెద్దలు చెబుతారు. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయకూడదు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి ఫలహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే అమావాస్య నాడు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం కూడా దరిద్రమే. అలాగే గోర్లు కూడా కత్తిరించుకోకూడదు.
అమావాస్య నాడు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకుంటే దరిద్రాన్ని మీరు ఆహ్వానిస్తున్నట్లే. అలాగే అమావాస్య రోజు లక్ష్మీ దేవిని పూజించక పోవడం కూడా ధరిద్రానికి సంకేతమే. మీకు చెప్పిన విషయాలు అన్ని పాటిస్తే దరిద్రం మీ దరి చేరకుండా ఉంటుంది. వీటితో పాటు ఎంత అత్యవసరమైన సరే నూతన పనులకు స్వీకారం చుట్టకూడదు. ఒకవేళ అప్పటికే మొదలైన పనులు ఉంటే వాటిని ఆపకూడదు. ఇవన్నీ పాటిస్తే దరిద్ర దేవత తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు.