"హనుమంతుని" దొంగలా చూస్తారట... ఎక్కడో తెలుసా?

VAMSI
హనుమంతుడు అంటే భక్తికి పరిపూర్ణ అర్దం, పరమ రామ భక్తుడు. నమ్మకం, విశ్వాసానికి మరో పేరు. రామ భక్తుడైన హనుమంతుడిని హిందువులు దేవుడిలా కొలుస్తారు. పూజలు పునస్కారాలు చేస్తారు. అలాంటిది ఒక ఊరిలో మాత్రం హనుమంతుడిని మాత్రం దొంగలా చూస్తారట. అసలు అక్కడ హనుమంతుడిని దేవుడిగా పూజించడం నిషేదమట. ఇది నిజంగా నిజమే ఎందుకు హనుమంతుడిని ఆ ఊరిలో పూజించరాదు ? దొంగలా ఎందుకు చూస్తారు ? అన్న వివరాలు ఇపుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాలో ద్రోణగిరి అనే గ్రామంలోని ప్రజలు ఆంజనేయ స్వామిని దొంగలా భావిస్తారు.  
ఈ గ్రామంలో ఆంజనేయుడిని పూజించడాన్ని నిషేధంగా భావిస్తారు. కనీసం హనుమంతుని ఫలం కూడా చేయరాదు. పొరపాటున ఎవరైనా హనుమంతుని కథ ఆరాధిస్తే ఏకంగా ఆ గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఇది అక్కడి రూల్. ద్రోణ గిరిలోని పర్వతాన్ని ఆనాడు హనుమంతుడు సంజీవని మొక్క కోసం తీసుకొని వెళ్ళాడు. సంజీవని మొక్క ఏది అన్నది తెలియక మొత్తం పర్వతాన్ని అక్కడ నుండి తీసుకెళ్లారు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో ఒక మహిళ సంజీవని మొక్కని హనుమంతునికి చూపించినప్పటికి ఆయన పర్వతం మొత్తాన్ని పెకలించి తీసుకువెళ్ళారు అని అక్కడి గ్రామస్తులు హనుమంతుని దొంగలా భావిస్తారు.
ఆ స్వామికి పూసల కానీ పూజించడం కానీ చేయడం నేరంగా పరిగణిస్తారు. అందుకే తరాల నుండి ఆ గ్రామస్తులే హనుమంతుని దొంగల భావించి పూజలు పునస్కారాలు చేయరు కనీసం హనుమంతుని పేరును కూడా స్మరించడానికి ఇష్టపడ్డారు. అయితే ఇలా జరగడం చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో పురాణాలలో జరిగిన విషయాన్ని ఆధారంగా చేసుకుని హిందువులందరూ ఎంతో ఇష్టంగా ఆరాధించే ఆంజనేయుని ద్వేషించడం ఎంత వరకు సమంజసమో వారే చెప్పాలి. ఈ విషయం మన దేశంలో చాలా మందికి తెలిసి ఉండక వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: