వచ్చే కలియుగం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా..!

MOHAN BABU
మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాల పై నడిస్తే, రెండవ యుగంలో మూడు పాదాలపై, మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగంలో మాత్రం ధర్మం  న్యాయం మంచితనం అనే మాటలకు చోటే లేదు అని చెప్పవచ్చు. మరి ఇంతకీ ఏ యుగం ఎలా సాగింది. ఇంకా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా..! వేదాల ప్రకారం కాల చక్రం సత్యయుగంతో ప్రారంభం అవుతుంది. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర అమావాస్య రోజున సత్య యుగం ప్రారంభమైందని చెప్పారు. కాలచక్రం ప్రారంభమైన తర్వాత త్రేతా, కృత  లేదా సత్య ద్వాపరయుగం ఇప్పటికే ముగిసిపోయాయి.  ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం.

 యుగం ప్రారంభమై ఇప్పటికే 5,000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. యుగాలు మారుతున్న కొద్దీ మానవుల ఆయు ప్రమాణం అనేది తీవ్రంగా తగ్గిపోతుంది. సృష్టి వినాశనం కూడా శాశ్వత పునరావృత ప్రక్రియ అని హిందూమతం నమ్ముతుంది. యుగానికి యుగానికి మానవుని ఆయుషులో చాలా వ్యత్యాసం వచ్చింది. 1,000 మహాయుగాలు ఒక కల్పం ఇది బ్రహ్మకు ఒక పగలు. అంటే రెండు కల్పాలు కలిస్తేనే ఒక రోజు. అంటే 86 బిలియన్ సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు. ప్రతి యుగం 17 లక్షల 28 వేల ఏళ్ళు, త్రేతా యుగం 12లక్షల 96 వేల యేళ్ళు. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఎనిమిది లక్షల  64 వేల ఏళ్ళు. కలియుగం 4 లక్షల 32 వేల ఏళ్ళు.

 యుగం ప్రారంభానికి సంధ్య అంత్యన్ని సంధ్యా సర అంటారు. పురాణాల ప్రకారం సత్య యుగం నుంచి కలియు గానికి చేరుకునే క్రమంలో మానవుల యొక్క సగటు ఎత్తు, ఆయు ప్రమాణం,  తెలివితేటలు, అనేవి తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే, త్రేతా యుగానికి పది వేలకు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు. 25 సంవత్సరాలు కృష్ణుడు జీవించాడు. దీని తర్వాతే కలియు గం ప్రారంభమైంది. అయితే యుగముగా మొదలై ఐదు వేల సంవత్సరాలు దాటింది. ఈ యుగంలో మానవుడు సగటు ఆయు వంద సంవత్సరాల కంటే చాలా తక్కువ. ఈ యుగం అంతం అయ్యే సరికి ఆయు ప్రమాణం 12 ఏళ్లకు కుచించుకు పోతుంది అని భగవద్గీత లోని శ్లోకాల్లో చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: