మరుగు మందు గురించి మీకు తెలుసా.. పెడితే ప్రమాదమేనా..!

MOHAN BABU
పూర్వకాలంలో ఎక్కువగా మూఢనమ్మకాల వల్ల వశీకరణ, మంత్ర తంత్రాలు అనేవి ఎక్కువగా నమ్మేవారు. అయితే ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ కారణంగా మన భారతదేశంలో కాస్త ఈ మంత్ర తంత్రాలు తగ్గిన గ్రామాల్లో మాత్రం కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువగా పూర్వకాలం మరుగు మందు అనేది  ప్రజలను భయపెట్టే ప్రధాన అస్త్రం. దీన్ని పెడితే తిరుగు ఉండదని భావించేవారు. పూర్వ కాలంలో దీన్ని ఎక్కువగా మగవారు ఆడవారికి, కొంతమంది ఆడవారు మగవారికి పెట్టేవారు. ఇలా పెట్టడం వల్ల వారు మాట వింటారని, ఎటు వెళ్ళారని భావించేవారు.

దీన్ని ముఖ్యంగా తినే ఆహారంలో పెట్టేవారు. తలకు మర్దన చేయడం. వీటిని ఎక్కువగా మనం పూర్వకాలం వాళ్ళ మాటల్లో వింటూ ఉంటాం. ప్రస్తుతం ఇవి ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే.. పూర్వకాలంలో మనిషికి ఒక నియమబద్ధమైన ప్రవృత్తి అనేది ఉండేది. దానివల్ల వాళ్ళు ఏది చేసినా ఫలిస్తుందని నమ్మకం ఉండేది. ముఖ్యంగా ఏదైనా మంత్రం ఫలించాలంటే నీకు నీతి, నియమం అనేది తప్పకుండా ఉండాలి.ఇందులో ముఖ్యంగా ఓంకారం. నిత్యం ఓంకారం చేస్తూ ఏ దురలవాట్లు లేని వారికి ముఖంలో ఒక వెలుగు వస్తుంది. ముఖ్యంగా ప్రాణ  యానం, యోగా చేసే వాళ్ళు చాలా బ్రైట్ గా కనిపిస్తారు. అలా ఓంకారం చేయటం వలన వీళ్ళకు ఒక బ్రైట్నెస్ అనేది, శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది.  దీని ద్వారా వారి ముఖం చూస్తే వారు ఏది చెప్పినా నమ్మాలని అనిపిస్తుంది. వారికి వాక్సిద్ది కలుగుతుంది కాబట్టి వారు ఒక మంచి మాట చెబుతారు. అది అందరికీ ఫలిస్తుంది. అయితే  వశీకరణ చేసే వారు కానీ మందు పెట్టే వారు కానీ శుద్ధి  కరణ కలిగినవారు ఎవరు ఉంటారు. పైగా లోక ఉపకారం కోసం చేసేది ఏదైనా సరే ఫలితాన్నిస్తుంది. ఇవి కాకుండా ఎవరినైనా నాశనం చేస్తే మాత్రం ఫలితం రాదు. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. మరుగు మందు పెట్టారని, దానివల్ల ఆ వ్యక్తి అలా  ప్రవర్తిస్తున్నాడని, దాన్ని మళ్లీ కక్కించాలనే విషయాలను గమనిస్తూ ఉంటాం. దీనివల్ల  ఏమి లాభం ఉండదు. మనిషి అనారోగ్యం బారిన పడటం తప్ప మరుగు

 మందు, వశీకరణ, మంత్రతంత్రాలకు ప్రస్తుత కాలంలో ఛాన్స్ లేదని చెప్పవచ్చు. ఒకవేళ అవి పని చేయాలి అంటే మనిషికి మంచిప్రవృత్తి, అలవాట్లు, ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. కానీ ప్రస్తుత కాలంలో ఎవరు కూడా అలాంటివి పాటించడం లేదు. భర్త మాట వినాలంటే ముఖ్యంగా అతనికి ఇష్టమైనవి ఏమిటో భార్య అందించాలి. భార్య మాట వినాలంటే ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకొని అవి నెరవేరిస్తే చాలు వారు మీ వశమై పోతారు. ఈ మందులు, వశీకరణాలు మన లోపల ప్రేమ లేనప్పుడు ఎలా పనిచేస్తాయి ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: