అప్పులతో ఇబ్బందులా.. ఎర్రపప్పుతో ఇలా చేస్తే అన్ని మాయం..!

MOHAN BABU
 మానవ జీవితంలో ఎవరైనా సరే అవసరాన్నిబట్టి అప్పులు అనేవి  చేస్తూ ఉంటారు. ఇందులో కొంత మంది ఇలా అప్పుడు చేస్తూ ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం ఇలా తెలియకుండానే మన అప్పులు ఎక్కువైపోతాయి. చివరికి ఏ అప్పు తీర్చాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ, అప్పులు తీసుకున్న వారు వచ్చి మనల్ని మాటలు అనడం మనం తీర్చాలి అనుకోవడం కాని తీర్చ లేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ మన జీవనం కొనసాగిస్తాం. మనం అప్పు తీర్చాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తే బాగుంటుంది. మనం అప్పు ఎలా తీర్చాలో తెలుసుకుందామా..! ముఖ్యంగా అప్పు తీర్చడానికి ఈ పరిహారాన్ని వాడితే చాలా బాగుంటుందని  ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు..!

మనం ఎర్ర పప్పును తీసుకుని ఒక రోజు నానబెట్టి, వీలైతే మంగళవారం రోజున ఎర్ర పప్పును కవర్లో వేసుకొని గోశాలకు వెళ్లి ఆ యొక్క పప్పును అక్కడ ఉన్నటువంటి ఎర్ర ఆవు ఉంటే ఆవుకు పెట్టండి. ఎర్ర ఆవు  లేకపోతే ఏదైనా ఒక దానికి పెట్టండి. ఈ విధంగా ఎర్రపప్పు నైవేద్యంగా పెట్టిన తర్వాత గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మీరు ఎవరికైతే లక్షల అప్పు ఉంటారో వారింటికి వెళ్లి  మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత వారికి ఇవ్వండి. దీని ద్వారా  మనకు చాలా సులభంగా అప్పు తీరిపోతుంది. ఇదే కాకుండా ఒక ఎర్ర బట్ట తీసుకొని దానిపై పిండి దీపాన్ని పెట్టి దానిలో ఆవాల నూనె వేసి ఎర్ర బట్టతో వత్తి తయారు చేసి వెలిగించండి. ఆ తర్వాత అప్పుడు బాధ తీరాలని కోరుకొని నిమ్మకాయను నైవేద్యంగా పెట్టండి. ఇది కూడా మంగళవారం రోజున చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది.

 ఈ పరిహారాన్ని ఉదయం 6 నుంచి 8 గంటల లోపు చేయాలి. ఇలా దీపం పెట్టి మేము అప్పు తీర్చాలి లక్షల అప్పు ఉంది అంటూ మనసులో తలచుకుంటూ పది నిమిషాలు అక్కడే ఉండి దండం పెట్టుకుంటే మీకు అప్పు తీరే మార్గాలను భగవంతుడు ప్రసాదిస్తాడని తెలుస్తోంది.
 ఇలా ఈ రెండు పరిహారాలు పాటిస్తే మీ అప్పులు తీర్చే మార్గాలు దొరుకుతాయి. దీనివల్ల అందరూ హ్యాపీగా జీవిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: