మనం కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటే, దానికి సంబంధించి వాస్తు ప్లాన్ అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క వాస్తు ప్లాన్ లో ఎన్నో విషయాలను చూసుకొని మన ఇంటి నిర్మాణాన్ని చేపడతాం. సాధారణంగా మనం కొనే స్థలానికి ఒక్కొక్కసారి ఎదురుగుండా రోడ్డు ఒకటి వచ్చి ఆగి పోతే దానిని వీధి చూపు లేదా వీధి పోటు అంటూ ఉంటారు. సాధారణంగా మన కాంపౌండ్ వరకు మనం నిర్మించే ఇల్లు వరకు మాత్రమే మనం వాస్తు చూసుకుంటాం. బయటి నుంచి వచ్చే రోడ్లు వీధి పోటుల గురించి సంబంధం ఉండదు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
సాధారణంగా వాస్తుశాస్త్రంలో చూసుకుంటే పరిసరాల అన్నిటికంటే ముఖ్యమైన వాస్తు అని చెప్పవచ్చు. పరిసరాల బాగా ఉన్న చోట మనం వాస్తు పాటించకుండా ఇల్లు కట్టిన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పూర్తి వాస్తు ప్రకారం గృహనిర్మాణం చేసుకొని పరిసరాలు అనుకూలంగా లేకపోతే సరైన ఫలితాలను ఇవ్వలేదు. ఒకే రకమైన ప్లాన్ ను పది చోట్ల ఇచ్చాము అంటే, ఆ పది చోట్ల మంచి ఫలితాలు మాత్రం ఇవ్వవు. అక్కడి పరిసరాలు సపోర్ట్ ను బట్టి దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటాయి. అయితే వీధి పోటు, వీధి చూపులకు వచ్చేసరికి వీధిపోటు అనేది చెడు ఫలితాలను ఇస్తుంది. అయితే వీధి పోటు వీధి చూపులు అనేవి ఒక దిక్కులో తగిలేది వీధిపోటు అయితే మరో దిక్కులో తగిలేది వీధి చూపు. ఉదాహరణకు తూర్పు ఆగ్నేయంలో ఒక రోడ్డు వచ్చి ఆగిపోయినట్లు అయితే దాన్ని వీధిపోటు అంటాం. అది చెడు ఫలితాలను ఇస్తుంది. అదే తూర్పు రోడ్డులో ఈశాన్యం నుంచి వచ్చి రోడ్డు ఆగిపోయినట్లు అయితే దాని వీధి చూపు అంటాం. అలాగే నాలుగు దిక్కుల్లో కూడా వీధిపోట్లు వీధి చూపులు ఉచ నిజాలు అనేవి ఉంటాయి. ఉచ భాగంలో తగిలే దాన్ని వీధి చూపు అంటాము. నీచ భాగంలో తగిలే దాని వీధి చూపు అంటారు . తూర్పు ఆగ్నేయం వీధి పోటు అగ్ని ప్రమాదాలకు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు అన్ఫిట్ అవ్వడానికి, కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ప్రాపర్టీ విడో ప్రాపర్టీ కింద అవ్వడానికి అంటే విధవ ప్రాపర్టీ అవ్వడానికి కారణం అవుతుంది.
అలా ఉన్న ఇళ్లల్లో కొన్ని చూసినట్లయితే తల్లిదండ్రుల నుంచి అది ఒక స్త్రీ యొక్క ఆస్తిగానే రావడం జరుగుతుంది. తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఫలితం అలాగా ఉంటే, తూర్పు ఈశాన్యం వీధిపోటు పురుషులను ఉన్నతంగా చేయడానికి, రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, మగ పిల్లల అభివృద్ధి పథంలో సాగడానికి కుటుంబం ఎంతో ఆనందంగా జీవించడానికి ఈ వీధి పోటు ఉపయోగపడుతుంది. కష్ట కాలంలో ఎందరో నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, తూర్పు ఈశాన్య వీధి పోటు గురించి ఎదురుచూసి అలాంటి స్థలాలను మాత్రమే కొనుగోలు చేస్తారు.