చెన్నై పై ముంబై గెలిచేందుకు ఏదైనా దారి ఉందా?

VAMSI
ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకు ఐపీఎల్ లో ఎంత ఘనమైన చరిత్ర ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ గత ఐపీఎల్ లో ఛాంపియన్ గా అవతరించింది . అయితే ఈ రెండు జట్లు కూడా సీజన్ మొదటి నుండి పేలవమైన ప్రదర్శన కనబరుస్తూ ఆల్మోస్ట్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. అయితే ముంబై మాత్రం ఇక ప్లే ఆప్స్ కు దూరం కాగా, చెన్నై కు మాత్రం ఇంకా కొంచెం ఆశలు మిగిలి ఉన్నాయి. మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలవడంతో పాటు మంచి నెట్ రన్ రేట్ ను తెచ్చుకోగలిగితే ఏమైనా ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి. కాగా ముంబై కనీసం కాస్త గౌరవంగా అయినా ఈ సీజన్ ను ముగిస్తుందా అన్నది చూడాలి. అందుకే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన ముంబై ఛేజింగ్ కు మొగ్గు చూపింది.
చెన్నై పై ముంబై గెలవాలంటే ?
1. ముందుగా గత మూడు మ్యాచ్ ల నుండి చెన్నై ఓపెనర్లు ప్రత్యర్థుల నుండి మ్యాచ్ ను లాగేసుకుంటున్నారు. ముంబై ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే... చెన్నై కు వెన్నెముకగా ఉన్న ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్ మరియు కాన్ వే లను పవర్ ప్లే లోనే అవుట్ చెయ్యాలి.
2 . కాన్ వే కు ఎటువంటి పరిస్థితుల్లో స్పిన్నర్ లతో బౌలింగ్ చేయించకూడదు. స్పిన్ లో ఏ విధంగా అడగలేదు అన్నది గత రెండు మ్యాచ్ లలో మనము చూశాము. స్లో బాల్స్ వేయగలిగే బౌలర్ కు దొరికిపోతాడు.. కాబట్టి ముంబై సామ్స్ ను ప్రయోగిస్తే బెటర్.
3. ఇక ఇదే జట్టులో ఉన్న అంబటి రాయుడు మరియు శివమ్ దుబేలను ఎక్కువ సేపు ఆడిస్తే మ్యాచ్ పోయినట్లే... అందుకే వీరిద్దరినీ తొందరగా ఫుట్ చేయాలి.
4. బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ తో పాటుగా బ్యాట్స్మన్ ను అనుసరించి బంతులకు వేయగలిగితే పరుగులు నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరుగులు రావో.. వికెట్లు ఈజీగా వస్తాయి.
5. చెన్నై ను 160 లేదా 170 లోపు కట్టడి చేస్తేనే... లేదంటే మళ్ళీ 200 మార్కు దాటారో ధోని తన కెప్టెన్సీ తో మాయ చేసేస్తాడు.  
6. ఇక ఛేజింగ్ లో రోహిత్ ఇషాన్ లు కాసేపు అయినా నెమ్మదిగా ఆడి పిచ్ ను అర్ధం చేసుకుని చెలరేగాలి. ఆలా కాకుండా అనవసర షాట్ లకు ప్రయత్నిస్తే ఇంతకు ముందు వచ్చిన ఫలితాలే వస్తాయి.
7. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ ను ఆడిస్తే... జట్టు పరిస్థితికి తగినట్లు అడగలడు. ఇక యువకులుగా ఉన్న రామం డీప్ సింగ్ మరియు షోకీన్ లు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి.
పై విధంగా ఆడితేనే ముంబై ఇండియన్స్ పటిష్టమైన చెన్నై మీద గెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: