సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎందుకు ఎగరవేయాలో తెలుసా..?

frame సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎందుకు ఎగరవేయాలో తెలుసా..?

Divya
ముఖ్యంగా మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు, బెల్లం విరివిగా ఉపయోగిస్తారు. అలాగే తమ ఇంటి దాబాల పైకి చేరి పిల్లలు, పెద్దలు సంతోషంగా ఒకచోట చేరి గాలిపటాలు ఎగరవేస్తారు. అంతేకాదు మరికొన్ని ప్రాంతాలలో అయితే గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగరవేయడానికి గల పౌరాణిక, శాస్త్రీయ కారణాలు ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఇకపోతే మకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఒక నమ్మకం దాగి ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడం వెనుక మత విశ్వాసం కూడా ఉందట.  మరి పురాణాలు సంక్రాంతి పండుగ రోజు గాలిపటం ఎగర వేయడానికి గల కారణాన్ని ఏం చెబుతున్నాయి అంటే.. పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున ఆకాశంలో గాలిపటం ఎగరవేశారట.. అందుకే మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతూ ఉంటారు.  ఇకపోతే రాముడు ఎగరవేసిన ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లిందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే గాలిపటాలు ఎగరవేస్తారు కాబట్టి అలా గాలిపటాలు ఎగరవేయడంలో శాస్త్రీయత విషయానికి వస్తే.. గాలిపటం ఎగరవేసే వ్యక్తి సూర్యుడు నుంచి శక్తిని పొందుతాడు. సూర్య రశ్మి అనేది శీతాకాలంలో ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. దీనివల్ల చేతులకు కూడా వ్యాయామం జరుగుతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.  అందుకే కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ రోజున ఇలా గాలిపటాలు ఎగరవేయాలని చెబుతూ ఉంటారు.  మరి సంక్రాంతి రోజే ఎందుకు ఎగరవేయాలి అంటే రాముడు ఆరోజు ఎగరవేశాడు కాబట్టి..  దేవతలను అనుసరించి మనం కూడా ఆరోజు గాలిపటాలు ఎగరేయడం వల్ల మన ఆరోగ్యం మరింత కుదుటపడుతుందని సమాచారం . ఏది ఏమైనా శాస్త్రాలు,  పౌరాణిక గాథలు చెప్పే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక నిజం దాగి ఉంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: