భోగి శుభాకాంక్షలు: భోగి పళ్ళు పోయడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి..?

Divya
తెలుగు రాష్ట్రాల ప్రజలు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి అని చెప్పవచ్చు. తెలుగు లోగిళ్ళ ముంగిట ముచ్చటైన ముగ్గులతో ఆడపడుచుల సందడి నేటితో మొదలయ్యింది. మూడు రోజుల ఈ సంక్రాంతి పండుగకు సమయం ఆసన్నమైన సందర్భంగా ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి.. అయితే దక్షిణాయణంలో సూర్యుడు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ.. దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల మనకు భూమిపై చలి కాస్త పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి వీలుగా ప్రజలు సెగ కోసం చలిమంటలు వేసుకుంటారు. అందులో భాగంగానే దక్షిణాయంలో ప్రజలు తమ పడిన కష్టాలను బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ.. రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇమ్మని కోరుతూ భోగభాగ్యాలు కావాలని ఆశిస్తూ భోగిమంటలు వేస్తారు.
ఇకపోతే ఇంతటి పవిత్రమైన రోజున పిల్లల తలపై భోగి పళ్ళు పోసి పెద్దలు ఆ పిల్లలను ఆశీర్వదిస్తారు.  అయితే ఇలా పిల్లల తలపై భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే.. సంస్కృతంలో రేగి చెట్టును బదరీ వృక్షంగా వ్యవహరిస్తారు.  రేగి చెట్లు,  రాగి పండ్లు ఆ నారాయణయుడి ప్రతిరూపంగా భావిస్తారు.  అంతేకాదు సూర్యునికి ప్రీతికరమైన ఫలం  కూడా ఇదే.. అందుకే రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తే పిల్లలకు మంచి పెద్దల నమ్మకం.  అంతేకాదు ఈ భోగి పండ్లను తలపై పోయడం వల్ల తలపై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతుల అవుతారని పెద్దలు చెబుతారు. కాబట్టి ఇలా భోగి పండుగ రోజు పిల్లల తలపై భోగి పళ్ళు పోయడం జరుగుతుంది.
ముఖ్యంగా రేగి పండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిలువ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి ఆరోగ్యంపై శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది. అందుకే రేగి పళ్ళను తప్పకుండా పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: