కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
టెంకాయలో పువ్వువస్తే మంచి జరుగుతుందా..?
పూజల్లో కొబ్బరికాయను భగవంతునికి సమర్పించినప్పుడు,ఒక్కోసారీ టెంకాయలో పువ్వు వస్తూ ఉంటుంది. ఇలా పువ్వు వస్తే చాలామంది అదృష్టంగా భావిస్తారు.వారి కోరికలు దేవుడు విన్నాడని ప్రగాఢ విశ్వాసంగా ఉంటారు. కానీ టెంకాయలో పువ్వు రావడంతోనే మనకు అదృష్టం కలిగి, స్థితిగతులు మారుతాయని భావించడం ఒక అపోహ మాత్రమే. కేవలం మనం భగవంతున్ని భక్తితో, నమ్మకంతో మాత్రమే పూజిస్తే,ఆ భగవంతుడే మనకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.
టెంకాయ కుళ్ళిపోయినప్పుడు చెడు జరుగుతుందా..?
టెంకాయను దేవుడి ముందు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి చెడిపోయి ఉంటుంది. దానివల్ల ఏదో మన ఇంట్లో కీడు జరుగుతుందని శంకిస్తూ ఉంటారు. కానీ టెంకాయ కొన్ని కారణాలవల్ల చెడిపోవడమే తప్పా,మన స్థితిగతులను మార్చదని, అవన్నీ వట్టి అపోహలేనని పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పట్టింపులు ఉండి, ఇలా జరిగిందేమిటి అని బాధపడుతూ ఉంటే, అలాంటివారు మరొకసారి తలస్నానం చేసి,దేవుడి యందు మనసు లగ్నం చేసి పూజిస్తే,మంచి ఫలితాలు ఉంటాయని నివారణ చర్యలను సూచిస్తున్నారు.