ఎలాంటి ఆకారాలు అద్దాలు ఏ దిక్కున పెట్టాలో తెలుసా..!

Divya
ప్రతి ఒక్కరూ పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు అద్దంలో చూసుకుంటూనే ఉంటాము.ఇంటి నిర్మాణం చేసేటప్పుడు,కొన్ని ఆకారాలున్న అద్దాలు దానితగిన దిక్కులలోనే పెట్టడం వల్ల, ఇంట్లో సిరిసంపదలు వెల్లువేరుస్తాయని లేకపోతే దాని స్థానంలో దరిద్ర దేవత ఆవహిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తు నిర్మాణం చేసినప్పుడు పంచభూతాలు సమ్మేళనంగా నిర్వహిస్తారు.ఈ పంచభూతాలకు అనుగుణంగా కొన్ని ఆకారాలు కలిగిన అద్దాలు మాత్రమే వాడాలి. కానీ చాలామంది అవగాహన లోపం వల్ల దీర్ఘ చతురస్రాకార రూపంలో అద్దాలు మాత్రమే వాడుతూ ఉంటారు.దీనివల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.అలాకాకుండా ఏ దిక్కున ఎటువంటి ఆకారం గల అద్దాలు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం..
 ఉత్తరం : వాయువ్యం నుంచి ఉత్తరం గోడకు పెట్టే అద్దం గుండ్రటి ఆకారంలో ఉండాలి. దీనివల్ల మన ఇంట్లో యజమాని ధనాదాయం పెరిగి, ఆరోగ్య సమస్యలు తొలగి, కుటుంబంమొత్తం సంతోషంగా ఉంటారు.
తూర్పు: తూర్పు గోడకు అద్దం పెట్టుకోవాల్సి వస్తే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న అద్దములు మాత్రమే పెట్టుకోవాలి. దీని ఫలితంగా మనకు వ్యాపార వాణిజ్యాలు పెరిగి,పై స్థాయిలో ఉన్న  వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దీని మూలంగా సమాజంలో మనకు మంచి గుర్తింపు కలుగుతుంది.
ఆగ్నేయం: ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆగ్నేయ మూలలు తగ్గినప్పుడు ఇంట్లోని వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మూలను పెంచుకోవడానికి త్రికోణకార అద్దాలను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చి, వివాహ సంబంధాలు మెరుగుపడతాయి.
పశ్చిమము : పశ్చిమ వైపు చత్రశాకారంలోన అద్దాలను పెట్టుకోవాలి. దీనివల్ల అనుకున్న పనులు సరైన సమయంలో జరిగి, ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది.
కానీ సాధారణంగా అద్దాలను ఉత్తర వైపు గానీ, తూర్పు వైపు కానీ, పెట్టుకోవడానికి మొగ్గు చూపాలి. దీనివల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు ఉంటుంది. దానితో కుటుంబంలో వ్యక్తులకు ఆయురారోగ్యాలు పెరిగి, సిరి సంపదలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: