కోరికలు తీరాలంటే, వచ్చే అక్షయ తృతీయ రోజు ఇలా చేసి చూడండి..!
కావాల్సిన వస్తువులు..
లక్ష్మిదేవి,మరియు కుబేరుడు చిత్రాదేవి సమేతంగా వున్న పటము,ఒక ప్లేట్,రెండు రూపాయల నాణేలు,ఒక లక్ష్మికాసు,తాంబూలం,దూది,దీపాలు, పంచామృతం,పండ్లు,పూలు,నైవేద్యం కొరకు పాయసం, దద్దోజనం,అగరబత్తిలు,కలశం మొదలగునవి.
పూజ నియమాలు..
ఇ పూజలో పెట్టె దీపం ఒక రోజంతా కొండెక్కకుండా చూసుకోవాలి,ఉపవాస దీక్షలు చేయాలి,మరియు పూజ ముందు,తరవాత రోజులు కూడా బ్రహ్మ చర్యం పాటించాలి.
పూజా విధానం..
అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్ర లేచి,ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,తలస్నానం చేసి,పూజ గదిలో పసుపుతో అలకాలి.దానిపై కుబేర ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు ఉంచాలి.కుబేర ముగ్గుపై పీఠం వేసి, ముందు చెప్పిన పటమును ఉంచి,పసుపు, కుంకుమ, పూలను పెట్టాలి.ఆ పటము ముందు కలశం ఉంచుకోవాలి.మరియు ఒక ఆకు తీసుకొని పసుపు గణపతి చేసుకొని పీఠము పైనే ఉంచుకోవాలి.ఆ తర్వాత ఒక ప్లేట్ లో లక్ష్మి కాసు,కుబేరుడు,చిత్రావతి ప్రతి రూపంగా రూపాయి నాణేలు ఉంచి పూజించాలి.మనకు వున్న కోరికలు అనుకుంటూ,నెరవెరతుందనే సంకల్పంతో కంకణం కట్టుకొని,ముందుగా గణపతి పూజ మొదలు పెట్టి,ఆ తరవాత షోడచపోచారా పూజ,లక్ష్మీ అష్టోత్తరపూజ,కుబేర మంత్రాలు జపించి,నైవేధ్యాలు సమర్పించాలి.ఇలా చేయడంతో లక్ష్మి,కుబేర అనుగ్రహం కలిగి,మనకున్న ఎంతటి కోరికలైన ఇట్టే నెరవేరుతాయి.