కలలో ఇలాంటి వస్తువులు కనిపిస్తున్నాయా.. అయితే అదృష్టమే..!!
దేవుడు, దేవాలయాలు..
కొంతమందికి రాత్రి సమయంలో వచ్చే కలల్లో దేవుడు కానీ,దేవా లయాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వారు మనం దేవుడికి ముక్కు తీర్చుకోవాలి అనుకుంటూ వుంటారు. కానీ దానికర్థం అది కాదని, ఆ దేవుడు మనల్ని కష్టాల నుంచి గడ్డెక్కిస్తున్నట్టు మరియు ఆర్థిక సమస్యలను తొలగించినట్టు అర్థమని స్వప్న శాస్త్రం చెబుతోంది.
జంతువుల తరుముతున్నట్టు..
చాలా మందికి పాములు తరుముతున్నట్టు, జంతువుల తరుముతున్నట్టు కలలో వస్తూ ఉంటాయి. దీనికి కారణం మన జీవితంలో మనం ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నట్టు అర్థమట. దానివల్ల ఎనలేని సంపద కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
పసుపు పండు..
ఎవరికైనా పసుపు పండు లేదా పువ్వులు కలలో కనిపిస్తే,స్వప్న శాస్త్రం ప్రకారం,ఆ వ్యక్తి బంగారు ప్రయోజనాలను పొందబోతున్నాడని అర్థం అట.లేదా వారికి పెద్దల ఆస్తి నుండి భాగం రావడానికి సంకేతం అట.
భారీ వర్షాలు..
ఎవరికైనా కలలో భారీ వర్షం కనిపిస్తే , అతను సంపద, కొత్త ఆదాయ వనరులను పొందబోతున్నాడని సంకేతం. మరియు ఈ కల ప్రకారం కుబేరుడి అనుగ్రహం మీపై ఉంటుంది.
ఎత్తుకు ఎక్కడం..
కలల శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఎత్తుకు ఎక్కినట్లు చూసినట్లయితే, అది శుభ కాలంగా పరిగణించ బడుతుంది. మరియు అది పురోగతికి సంకేతం,అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. తొందర్లో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగబోతున్నట్టు అర్థం.