అద్భుత పుణ్యధామంగా అయోధ్య.. 3600 విగ్రహాలు..
అయితే మనం ఇలా చేయడాన్ని కొంతమంది మూఢనమ్మకం అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ దాని వెనక మన భావన వాళ్లకి అర్థం అవ్వదు. మనకు సహాయపడే ప్రతి దాన్ని గౌరవించాలి, పూజించాలి, అన్ని ప్రాణులను సమానంగా చూడాలి అనే భావన అది. ఇలా మనం ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాం. అయితే దేవుని నమ్మడం, కొలవడం కూడా తప్పు అని, అది ఒక మూఢ నమ్మకం అని మాట్లాడే సెక్యులర్ మేధావుల వల్ల అది నిజమేమో అనుకుని కొంతమంది దేవుడిని పూజించడం కూడా మానేశారు.
అయితే తాజాగా ఈ ఆలోచనలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. తనకు మించిన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నారు. అలాగని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనే పద్ధతిలో అయితే లేరు వాళ్ళు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తూ ఫలితం మాత్రం దేవుడికి వదిలేస్తున్నారు వాళ్ళు. దాని ఫలితంగా మనశ్శాంతి అనేది వాళ్ళకి దొరుకుతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే సైన్స్ నే సైకియాట్రిస్ట్ గా భావించే వాళ్ళు కొంతమంది దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు కనిపించేదే నిజం. కనపడంది అబద్ధం. అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆనాటి శ్రీలంక నుండి తెప్పించిన అరుదైన వృక్షాలను రామ మందిర పరిసరాలలో పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 3600 దేవతా విగ్రహాలను అయోధ్యలోని పలు ప్రదేశాల్లో భక్తుల సందర్శనార్థం ప్రత్యేకంగా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.