చేతిలో వస్తువులు కింద పడ్డాయంటే దురదృష్టమే..!
వంట చేస్తున్న సమయంలో ఉప్పు జారిపోవడం చాలా తప్పు ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపం కనుక ఉప్పు జారిపోవడం వల్ల కొద్ది రోజులకు డబ్బు కొరత ఏర్పడుతుందట. అంతేకాకుండా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయని సూచన ఉన్న సమయంలోనే ఉప్పు ఒలిగిపోతుందట
మనం ఏదైనా సందర్భంలో పాలు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అవి ఒలికిపోయినా పగిలిపోయిన పలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట. అంతేకాకుండా పాలు పొంగడం జార వేయడం వంటివి చేస్తే ఆ కుటుంబానికి చాలా ప్రతికూల శక్తి పెరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
మనం వంటలలో ఉపయోగించి నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఒకవేళ పొరపాటున ఇవి చేజారిన రాబోయే రోజుల్లో తమకు దగ్గరగా ఉన్న సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉండడానికి సంకేతం అన్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం పప్పులు పిండి వంటివి ఉంటాయి వీటిని అసలు చేజారనివ్వకూడదట ఇవి కింద పడడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు పలు రకాల సమస్యలు కూడా ఎదురవుతాయట. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అన్నం ముద్దను కళ్ళకు అద్దుకొని తినడం చాలా మంచిది. భోజనం తిన్న తర్వాత అన్నాన్ని ఎక్కువగా విడిచిపెట్టినట్లు అయితే రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముడతాయట. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు వారు ఇచ్చిన ప్రసాదం కింద పడిందంటే ఏదో అశుభం జరగబోతున్నట్లు సమాచారం