తిరుమలపై అడుసు తొక్కనేల.. కాలుకడగ నేల?
ఈ వివాదం సద్దుమణిందనే లోపు తిరుమల కాలినడకపైన చిన్నారిని చిరుతపులి నోట కరుచుకు వెళ్లి చంపేయడంతో ఒక్కసారిగా టీటీడీపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మరుసటి రోజే చిరుతను బోనులో బంధించిన సిబ్బంది ప్రజలకు భయాన్ని పోగొట్టే చర్యలు చేపట్టింది. అయితే కాలినడకన వెంకన్న సన్నిధిని చేరుకోవాలనుకునే భక్తులకు చిరుత పులి లేదా ఏదైనా అటవీ జంతువుల నుంచి రక్షణ కోసం కర్రలు ఇవ్వాలని నిర్ణయించింది.
అదే విధంగా ఆ కర్రల్ని పట్టుకుని కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లాలని చెప్పారు. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా చిన్నప్పుడు అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల మార్గం అంతటా బోడిగుండులా ఉండేదని అసలు ఏ మాత్రం అటవీ లేదు. చిరుత పులులు ఉండేవి కావన్నారు. దీంతో మరోమారు భూమనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల చుట్టూ చిట్టడవి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
50, 60 ఏళ్ల కిందట తిరుమల ఎలా ఉందో చూపిస్తూ ఫోటోలు, వీడియోలు పెడుతూ టీటీడీ చైర్మన్ పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో సేవ చేసే భాగ్యం కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. తిరుమల చుట్టూ బోడి గుండు అనే మాటతో ఆయన పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని విమర్శిస్తున్నారు.