నరదృష్టితో బాధపడుతున్నారా..అయితే ఈ నివారణ మీ కోసమే..!

Divya
సాధారణంగా నరదృష్టి కలగడం వల్ల,మనిషికి మాత్రమే అనారోగ్యం వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు.కానీ నరదృష్టి కలగడం వల్ల కొన్ని కుటుంబాలలో అశాంతి నెలకొనడం వారు అనుకున్న పనులు సజావుగా జరగకపోవడం,వారి వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు కానీ,లాభాలు కానీ రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.ఇలాంటి వాటిని చాలామంది అంతాగా పట్టించుకోరు.కానీ అవి అన్ని కేవలం నరదృష్టి వల్ల మాత్రమే కలుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే వారు అనుకున్న పనులు ఎవరితోనైనా సంభాషణ చేయడంతో కూడా వెంటనే అవి జరగకుండా కూడా అవుతుంటాయి.అలాంటి నరదృష్టిని పోగొట్టుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయని వేద పండితులు కూడా చెబుతుంటారు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
ఈ నివారణ కోసం ముందుగా స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నలుపు దారం కట్టుకోవడం వల్ల ఇటువంటి చీడపీడలైనా మన వరకు రాకుండా ఉంటాయి.ముఖ్యంగా చిన్న పిల్లలకు నరదృష్టి కలగకుండా వారికి కచ్చితంగా ఎడమ చేతిలో కానీ,ఎడమ కాళీలో కానీ నల్లబొట్టు పెట్టడం,రోజూ సాయంత్రం ఉప్పుతో దిష్టి తీయడం వంటివి తప్పకుండా చేయాలి.
ముఖ్యంగా ఇంటిపైన నరదృష్టి పడటంతో మన ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా,అనుకున్న పనులు సజావుగా జరగవు.అలాంటివారు ముందుగా ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో 11 రూపాయలను మరియు గుప్పెడు నల్లటి నువ్వులను వేసి,అందులోని నిమ్మకాయ కొంచెం పసుపు,కుంకుమ వేసి మూట కట్టి ప్రధాన గుమ్మానికి కట్టాలి.ఇలా కట్టుకోవడం వల్ల మన మనపై కానీ మన ఇంటిపై కానీ ఎలాంటి నడదృష్టి ఉన్నా కూడాఇంట్లోకి రాకుండా కాపాడుతాయి.ఇలా ఈ నరదృష్టి నివారణను అమావాస్య రోజు కానీ,ఏదైనా మంగళవారం పూట కానీ చేసుకోవడం చాలా మంచిది.
ఎవరైనా తమకి తాము నరదృష్టితో బాధపడుతున్నామని తెలిసిన వారు,వారు చేసే పనులు ఇతరులతో డిస్కర్షన్ చేయడం ఆపుకోవాలి.నరదృష్టి వల్ల కూడా కొన్ని పనులు జరగవు.కావున వారి పని జరిగేంతవరకు ఎవరితోనూ చెప్పకుండా ఉండడమే చాలా ఉత్తమం.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే ఈ నివారణ పాటించడం వల్ల,తొందర్లోనే మీకు నరదృష్టి తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: