పచ్చ కర్పూరం వల్ల ఇంట్లో జరిగే అద్భుతాలు ఇవే..!!
పచ్చ కర్పూరం వాసన చాలా గొప్ప శక్తిని కలిగిస్తుందని పలువురు పండితులు సైతం తెలుపుతున్నారు. అంతేకాకుండా పూజ గదిలో రెండు కంటే ఎక్కువ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుందట.. ఎవరింట్లోనైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఒక నెల రోజులపాటు ఈ పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే అవన్నీ తొలగిపోతాయట. పచ్చ కర్పూరం వాసన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అందుకే ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు సైతం ఎక్కువగా పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉండమని పండితులు సైతం తెలియజేస్తూ ఉంటారు.
ముఖ్యంగా పచ్చ కర్పూరం ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది.. అలాగే పచ్చ కర్పూరాన్ని పసుపు గుడ్డలు కట్టి దేవుని మూల ఉంచితే చాలా మంచిది. అలాగే తులసి చెట్టుకు కూడా ధూపం పూజలు చేస్తే ధన ప్రాంతం లభిస్తూ ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు పచ్చ కర్పూరాన్ని ఇంట్లో వెలిగిస్తూ ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుందట. ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు కూడా రావని పండితులు తెలుపుతున్నారు. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చ కర్పూరం ఉండడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
సుఖ సంతోషం కలగాలి అంటే పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉండాలి పచ్చ కర్పూరాన్ని ఒక చిన్న బౌలులో ఉంచి ఒక్కొక్క గదిలో ఉంచితే ఆ ఇల్లు సుఖసంతోషాలతో చాలా ఆనందంగా ఉంటుందట.