గ్రహణం రోజున అస్సలు తినకూడదా..?
భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు.. చంద్రుడు జలగ్రహం.. చంద్రుని ఆకర్షించే శక్తి భూమి పైన ఉండే జలవర్గం పైన చాలా ప్రభావం చూపుతుందట. మానవుని శరీరంలో కూడా 80 శాతం నీరు ఉండడం వలన ఉద్రేకానికి గురి అవుతారు.. కేవలం మామూలు రోజులలోనే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహణం సమయంలో ఈ ఆలోచనలు చాలా విపరీత స్థాయికి చేరుతాయట. అందువలన గ్రహణం సమయంలో కేవలం జపాలు చేసుకుంటూ ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉంటారు. ఇలాంటి సమయంలోనే పలు రకాల నియమాలను పాటించమని చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా ఆహార నియమాలలో గ్రహణం పట్టడానికి తొమ్మిది గంటల ముందు గ్రహం విడిచే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని పలువురు పండితులు సైతం తెలుపుతుంటారు శరీరంలో 80 శాతం నీరు నిండి ఉన్నందువలన.. శరీరం పై ఈ ప్రభావం చాలా చూపుతుంది.. మూత్ర కోశాలు మెదడు మొదలైన వాటిలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటాయట ఈ పరిణామం అప్పుడే కనపడదు రాను రాను రోజుల్లో కనిపిస్తుందట. గ్రహణం సమయంలో ఏదైనా తిన్న తర్వాత ఆహారం జీర్ణం కాకుండా ఉంటే అది వ్యతిరేక శక్తిని కలిగిస్తుంది. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారాన్ని కూడా ముట్టుకోకూడదు.. ముఖ్యంగా స్నానం కూడా చేయకూడదని పండితులు తెలుపుతున్నారు