కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి..?
దీపాలను స్వచ్ఛంగా వెలిగించాలి.. స్వచ్ఛమైనవిగా అంటే గతంలో ఎప్పుడు ఉపయోగించని నూనెను వత్తులను శుభ్రమైన దీపాన్ని సైతం పెట్టడాన్ని స్వచ్ఛమైన దీపంగా తెలియజేస్తారు. పాత వాటిని కూడా అసలు ఉపయోగించుకోకూడదు.
ముఖ్యంగా శివుడి ముందు దీపాలను వెలిగించడానికి సైతం.. ఇత్తడి, రాగి మట్టితో చేసిన దీపాలను మాత్రమే ఉపయోగించాలి. ఇది చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాము. ఇతర లోహాలతో తయారుచేసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.
అయితే దీపారాధన చేసేటప్పుడు కేవలం వట్టి దీపారాధన మాత్రమే వెలిగించకుండా.. ముందుగా పసుపు బియ్యం పూలరేకులు వేసి ఆ తర్వాత నెయ్యి నువ్వుల నూనె కలిపిన దీపాలను సైతం వెలిగించాలి. చాలా మంది తమకు తెలియకుండానే.. అన్ని దేవతల ముందు పది రకాల దీపాలను సైతం వెలిగిస్తూ ఉంటారు అయితే కొన్ని నూనె దీపాలను కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే దేవతలకు అంకితం చేయవలసి ఉంటుందట. అందుచేతనే దీపాలను వెలిగించేటప్పుడు పండితులను సైతం కనుక్కొని వెలిగించడం మంచిది.
జ్యోతిష్యులు తెలిపిన ప్రకారం కార్తీక మాసం రోజున దీపాలను వెలిగించడం వల్ల పలు రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చట.. ముఖ్యంగా ఇంటిని అలంకరించుకొని ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఏదైనా శివుడి దేవాలయం దగ్గర ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే మంచి జరుగుతుందట. ముఖ్యంగా దీపాలను వెలిగించేటప్పుడు పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది.