ధనం ఇంట్లో నిలవాలంటే పూజగదిలో కచ్చితంగా ఉండాల్సిన వస్తువులివే..!

Divya
చాలామంది ఎంత కష్టపడినా సరే డబ్బు వస్తూ ఉంటుంది కానీ,నెల తిరిగే లోపు మరి లోటు ఏర్పడుతూ ఉంటుంది.ఇలా డబ్బు లోటు ఏర్పడినప్పుడల్లా అప్పు చేయడం,బదులు తీసుకోవడం వంటి పనులు చేయవలసి వస్తూ ఉంటుంది.అలా కాకుండా కొన్ని రకాల వస్తువులను మన పూజ గదిలో ఉంచుకోవడం వల్ల ధనానికి ఎప్పుడూ కొరత రాదని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు.అంతేకాక ఆ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి,ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు.
పసుపు గవ్వలు..
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుందట.దీనితో ఎటువంటిఆర్థిక సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు. పసుపు గవ్వలను 9 కాని 11 కాని పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది.
ఆవు దూడ ఉన్న విగ్రహం..
కామధేను విగ్రహము పూజ గదిలో ఉంచి,పూజించడం వల్ల కామదేనువు యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఇటువంటి లోటు కలగదు.అంతేకాక సంతానలేమితో బాధపడేవారికి కూడా గోమాతను పూజించడం చాలా ఉత్తమం.
లవంగాలు,యాలకులు..
పూజ గదిలో కచ్చితంగా ఉండవలసిన వాటిలో యాలకులు,లవంగాలు ముఖ్యమని అని చెప్పవచ్చు.యాలకులను ఇంట్లో ఉండి పూజ గదిలో ఉంచుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షించి,ఆర్థిక సమస్యలను పోగొట్టడమే కాకుండా,ఇంట్లో గొడవలు కూడా రాకుండా చేస్తుందట.యాలకులతో పాటు 11 లవంగాలను ఉంచి దేవుడికి సమర్పించడంతో కూడా ధనకర్షణ జరుగుతుంది.అంతే కాక అనుకున్న పనులు సజావుగా జరిగి,సరైన సంపద కలుగుతుంది.
చిట్టి గాజులు..
లక్ష్మీదేవికి సమర్పించడానికి చిట్టి గాజులను వాడుతుంటాం కదా.ఆ చిట్టి గాజులనే 11 కానీ 9 కానీ పూజ గదిలో ఉంచి పూజించాలి.దానితో కూడా మంచి ఫలితం లభిస్తుంది.
తాబేలు విగ్రహం..
కూర్మావతారమైన విష్ణుకు ఎంతో ఇష్టమైన తాబేలును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తున్నట.ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్న కూడా తొలగిపోయి,వారి కుటుంబం అభివృద్ధిలోకి అడుగుపెడుతుందని వేద పండితులు చెబుతున్నారు.మీరు కూడా మీ ఇంట్లో ఈ ఐదు వస్తువులనే ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: