శని దోషాలు పోగొట్టుకోవాలంటే చీమలకి ఈ ఆహారం పెడితే చాలు..!

Divya
సాధారణంగా ఎటువంటి కష్టాలకైనా అదిపతి శని భగవానుడేనని భావిస్తూ ఉంటారు.ఏ చిన్న కష్టం వచ్చినా సరే,శని భగవానున్ని తిట్టుకుంటూ ఎప్పుడు యేదొక సమస్యను అనుభవిస్తూ ఉంటారు.లేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.కానీ రహస్య శాస్త్రాల ప్రకారం శని భగవానుడు చేసినంత మేలు ఏ దేవుడు చేయడని చెబుతున్నాయి.వారి జన్మతహ శని దోషాలు ఉన్నవారైతే,కొంతకాలం పాటు అ కష్టాలను కచ్చితంగా అనుభవించాల్సిందేనని చెబుతున్నారు.
ఎందుకంటే సృష్టికి మొత్తం మూలమైన శివుడే కొంతకాలం పాటు శని భగవానుడు ఆవహిస్తాడని దాక్కున్న సమయాలు ఉన్నాయి కదా.ఆయనతో పోలిస్తే మనం ఎంత చీమంతైనా కాదు.కానీ అటువంటి శని దోషాలను తొలగించడానికి కూడా కొన్ని రకాల నివారణలు రహస్య శాస్త్రాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు.అవేంటంటే కొన్ని రకాల ఆహారాలను చీమలకు వేయడం వల్ల,మనిషికి వున్న శని దోషాలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి,శనిపీడ తొందరగా తొలగుతుందని సూచిస్తున్నారు.మరి అవి ఏంటో తెలుసుకుందామా..
దీనికోసం  ముందుగా 100 గ్రామ్స్ ఎండు ఖర్జూరం,100 గ్రామ్స్ చక్కెర,100 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడి తీసుకొని,అన్నీ కలిపి, మీక్సీ పట్టి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఎవరైతే శని దోషాలతో బాధపడుతూ,ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా దెబ్బతిన్న వారు ఉంటారో,వారు ఈ పొడిని రోజు ఉదయం లేవగానే చీమలకు ఆహారంగా పెట్టాలి. మరియు వారు తినే మొదటి ముద్దను తీసి కాకికి ఆహారంగా పెట్టడం వల్ల కూడా శని దోషాలు తొందరగా తొలగిపోతాయి.
వీటన్నిటితో పాటు ఉద్యోగ అభివృద్ధి,వ్యాపారంలో రాణించాలంటే శని దోషాలకు శని గ్రహ పూజలు నిర్వహించుకోవడం చాలా ఉత్తమం.మరీ ముఖ్యంగా ఈ పూజను శని త్రయోదశి రాడు ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.వ్యాపారం చేసే స్థలంలో వ్యాపార వృద్ధి కోసం ఒక ఎర్రటి గుడ్డలో 11 యాలకులు,11 ఎండుమిర్చి,నిమ్మ పండు వేసి, గుమ్మానికి వేలాడదీయడం వల్ల ఎటువంటి శని దోషాలు అయినా తొలగిపోయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది.మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: