తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు 19న రిలీజ్ చేయగానే ఉన్నట్లు ప్రకటించింది. ఈ సేవా టికెట్లు ఆగస్టు 19 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ కానున్నాయి. శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఈ టికెట్లు త్వరగా బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుంచి 23 డేట్స్‌లో మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించాలి. ఇలా మనీ పే చేసిన వాళ్లకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు కావడం జరుగుతుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో "పుష్పయాగం" ఘనంగా జరపనున్నారు. దీన్ని తిలకించేందుకు కూడా టికెట్లు ఉంటాయి. ఈ పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఆగస్టు 22న వర్చువల్ సర్వీస్ టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో పెళ్లి చేస్తారు. నవంబరు నెలలో శ్రీవారి ఆలయంలో జరగనున్న అంగప్రదక్షిణం టోకన్లు ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. నవంబరు నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం కోసం ఫ్రీగా దర్శన టోకెన్లు కూడా ఇష్టం వస్తున్నారు. అయితే నవంబరు నెలకు సంబంధించిన ఈ ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆగస్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల టిటిడి రిలీజ్ చేయనుంది. ఉదయం 10 గంటలకు నుంచి ఇవి బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల బస చేయాలనుకునేవారు ఇక్కడ రూమ్స్ ని బుక్ చేయడానికి టికెట్లను కొనుగోలు చేయాలని భావిస్తారు. ఆ రూమ్ టికెట్స్ ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు 27న తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ టికెట్లను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో అమ్ముతారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలో లాగిన్ అయి బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.