మహబూబ్‌నగర్ గుంటూరు బస్ సర్వీస్‌ల పూర్తి డీటైల్స్... ఎప్పుడెప్పుడు ... ఏ రూట్లో అంటే..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావ తి ప్రాంతం లో రెండు కీలక నగరాలు విజయవాడ - గుంటూరు . ఈ రెండు నగరాలకు రెండు తెలుగు రాష్ట్రా ల్లోని పలు కీలక నగరాలు .. పట్టణా లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ని పలు బస్ డిపోల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. విజయవాడ - గుంటూరు రెండు నగరాలకు రవాణా తో పాటు బస్సు కనెక్టివిటీ లు ఎంతో కీలకం. ఈ క్రమంలోనే తెలంగాణ లో పలు కీలక పట్టణాల నుంచి గుంటూరుకు బస్సు సర్వీసులు ఉన్నాయి.
మహబూబ్ నగర్ నుండి గుంటూరు ఆర్టీసీ బస్సు సర్వీసు వివరాలు ఇండియా హెరాల్డ్ పోర్టల్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ బయస్సు మహబూబ్ నగర్ నుంచి గుంటూరు వరకు వెళుతుంది. మహబూబ్ నగర్ నుంచి వయా : - జడ్చర్ల , కల్వకుర్తి , దేవరకొండ , మాచర్ల , గురజాల , పిడుగురాళ్ల , సత్తెనపల్లి మీదుగా గుంటూరు చేరుకుంటుంది.
బస్సు సర్వీసు టైం :
ఉదయం 7 గంటలకి మరియు రాత్రి 8:15 కి ప్రతి రోజు మహబూబ్ నగర్ నుంచి గుంటూరు కి రెండు ఎక్స్ప్రెస్ బస్సులు బయలు దేరతాయి.
మొదటి బస్ : -
ఉదయం 7 గంటలకి మహబూబ్నగర్లో మొదలైన బస్సు మధ్యాహ్నం 12:15 కి మాచర్ల, 2:00 గంటలకి పిడుగురాళ్ల 2:45 కి సత్తెనపల్లి మరియు గుంటూరు కి సాయంత్రం 3:30 కి వస్తోంది .
రెండవ బస్ : -
రాత్రి 8:15 కి మహబూబ్నగర్ లో బయలుదేరిన బస్సు రాత్రి 1:30 కి మాచర్ల, 3:00 గంటలకి పిడుగురాళ్ల, 3:45 కి సత్తెనపల్లి మరియు ఉదయం 4:30 కి గుంటూరు వస్తోంది.