ఉగాది రోజున పంచాంగం ఎందుకు చెబుతారు ? అలా చెప్పకపోతే ఏం జరుగుతుందంటే..?
అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం మన హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఆచారం .. రాబోయే భవిష్యత్తును అంచనా వేసే మార్గంగా దీన్ని వేద పండితులు భావిస్తారు .. అలాగే పంచాంగం ద్వారా రాశుల ప్రభావం, వర్షపాతం, వ్యాపారం ,ఆరోగ్యం, సమాజంపై వచ్చే మార్పులను అన్ని తెలుసుకోవచ్చు . అలాగే వచ్చే ఏడాది శుభ శకునాలు గ్రహ మార్పులు, వాటి ప్రభావాలు మనం పాటించాల్సిన జాగ్రత్తలు పండితులు ప్రజలకి వివరంగా తెలియజేస్తారు .. గురు, శని, రాహు, కేతు,వంటి గ్రహాల సంచారాలు మన జీవితం,పై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ పంచాంగంలో వివరంగా చెప్పబడుతుంది .
ఇక కొన్ని సందర్భాల్లో గ్రహ దోషాల నివారణ కోసం యజ్ఞ యాగాదులు దానధర్మాలు ప్రత్యేక పూజలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా వేద పండితులు చెబుతారు .. అలాగే అంతేకాకుండా కొత్త సంవత్సరం లో పెళ్లిళ్లు , గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలకు ముహూర్తాలను తెలుసుకోవడానికి కూడా పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది .. అలాగే మన హిందూ పంచాంగం అనేది ఎంతో ఖచ్చితమైన గణాత్మకమైన విధానంలో ఉంటుంది దీనిలో పండగలు శుభముహూర్తాలు రోజువారి తిధులు నక్షత్రాలు యోగాలు వంటి అంశాలు ఎంతో ప్రాముఖ్యత తెచ్చుకున్నాయి .. అలాగే తిధి నక్షత్రాలు యోగాలు ఆధారంగా రూపొందించబడింది . అలాగే ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున వేద పండితులు పంచాంగాన్ని చదివి భవిష్యత్తులో వచ్చే ఫలితాలను చెబుతారు ..
ఇక పంచాంగంలో ఐదు ముఖ్య అంశాల సమాహారం :
-రాశి
-నక్షత్రం
-తిథి
-యోగం
-కరణం
ఈ అంశాల ఆధారంగా రోజువారి వార్షిక కాలగణనలు రూపొందించబడతాయి ..
పంచాంగ గణన రకాలు:
దృక్ పంచాంగం- ఇది ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఖచ్చితమైన ఘనాలను చెబుతుంది..
వాక్ పంచాంగం: ఇది గ్రహాల కదలికల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేచి చెబుతుంది..
ఇక పంచాంగ శ్రవణం వల్ల శ్రీ మహావిష్ణువు , కాలపురుషుని ఆరాధన జరుగుతుంది. ఈ కాలపురుషుడు సమయాన్ని సూచించే శక్తిగా భావించబడతాడు మన జీవితంలో ప్రతిక్షణం ఎంతో విలువైనదని గుర్తుచేసే సంప్రదాయమే ఈ పంచాంగ శ్రవణం అని అంటారు . కాలం అనగా సమయం మానవ జీవితంలో ఎంతో అత్యంత కీలకమైనది .. మానవుడు కాలాన్ని నియంత్రించలేడు.. కానీ దానిని సద్వినియోగం చేసుకోవచ్చు . మానవుడు చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది కర్మ ఫలితాలను తగ్గించుకోవడానికి జపాలు పూజలు వ్రతాలు చేయటం కూడా ఎంతో ముఖ్యం . ఈ ఉగాది రోజు తినే పచ్చడిలో కూడా షడ్రుచులు తీపి చేదు ఉప్పు పులుపు మొదలైనవి . మన జీవితంలో అన్నీ అనుభవాలను సమానంగా తీసుకోవాలని గుర్తు చేస్తాయి .
అలాగే ఉగాది పంచాంగం వినడం కారణంగా భవిష్యత్తును అంచనా వేసుకోవడం మాత్రమే కాకుండా .. శుభ శకునాలను అందరూ తెలుసుకోవచ్చు . అలాగే ఏ పనులు ఎప్పుడు చేయాలో కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు .. అనుకోని ఆటంకాలను తగ్గించుకోనేందుకు పరిహారాలు కూడా పాటించవచ్చు . ఈ కాలపురుషున్ని పూజించడం ద్వారా సమయాన్ని సమద్వంతంగా సద్వినియోగం చేసుకోవచ్చు . అందుకే ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణం చేయడం ఎంతో ముఖ్యమైన సంప్రదాయంగా సనాతన ధర్మం చెబుతుంది .