మౌని అమావాస్య: ఈరోజు ఆ ఒక్క పని చేస్తే మీ తలరాత మారుతుంది..ఆ 43 నిమిషాలే కీలకం.!

మన భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుండడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని నమ్ముతూ ఉంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మౌని అమావాస్య.. ఈ రోజున కొన్ని పనులు చేస్తే జీవితం చాలా సుఖమయం అవుతుంది. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు ఆ 43 నిమిషాల్లో మనం చేసే పని చాలా కీలకం.. ఆ టైం ఎప్పుడు వివరాలు చూద్దాం.. జనవరి 18, 2026 మాఘ మాసంలో మౌని అమావాస్య వచ్చింది. ఈరోజు సర్వార్త సిద్ధియోగం మరియు శివావాసం వంటి యోగాలు కలిసి రావడం చాలా ప్రత్యేకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం కొన్ని ప్రత్యేక క్షణాల్లో ఈ సాధన చేస్తే జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మౌన మంత్ర జపం అనేది ఆ 43 నిమిషాలు చేయడం చాలా అద్భుతం. మధ్యాహ్నం 2:17 నిమిషాల నుంచి మొదలు 3:00 వరకు ప్రత్యేక ముహూర్తం ఉన్నది.. ఈ 43 నిమిషాల కాలంలో " ఓం గౌరీ శంకరాయ నమః " అనే మంత్రాన్ని జపించడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయని పండిత నిపుణులు అంటున్నారు.

మౌనవ్రతం:
ముఖ్యంగా మౌని అమావాస్యకి మౌన సాధన చేస్తే జీవితంలో అనేక ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక నిర్దిష్ట సమయం ఉంది కాబట్టి ప్రశాంతంగా మనసులోని మంత్రాలని జపిస్తూ ఈ సాధన చేస్తే శరీరంలోని శక్తి చక్రాలు సమతూల్యమవుతాయని శివపార్వతుల ఏకత్వానికి ప్రత్యేకమైన ఈ మంత్రం వైవాహిక ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేస్తుందని అంటున్నారు.

 సుఖ జీవనం: ఈ మౌని అమావాస్య రోజున మంత్రం జపించి మౌనం పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఏడాది పొడువునా ఆర్థిక ఇబ్బందులు కలగవని అంటున్నారు.

ప్రశాంతత
: ముఖ్యంగా ఈ జపం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి బంధాలు మరింత బలంగా తయారవుతాయని నమ్ముతారు.

పితృ దోషం:
ముఖ్యంగా మౌని అమావాస్య రోజున ఈ సాధన చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమై ఆశీర్వాదాలు ఇస్తారని దీని వల్ల జీవితం బాగుంటుందని అంటున్నారు.

 భయాందోళనలు: ముఖ్యంగా మౌని అమావాస్య రోజున ఈ వ్రతం చేస్తే మన శరీరంలోని భయం, నిరాశ, నిస్పృహలు తొలగిపోయి, పాజిటివ్ ఆలోచనలు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లడానికి బాగుంటుందని పండిత నిపుణులు అంటున్నారు.

 పనుల్లో వేగం: మౌని అమావాస్య రోజున ఆ 43 నిమిషాల పాటు మనం నిష్టగా పూజ చేస్తే ఆగిపోయిన పనుల్లో కూడా వేగం పెరుగుతుందని పండిత నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: