ఎట్టి కర్మ వెయ్యి యజ్ణాలంతటి ఉన్నతమైనది?

Durga
మన భారతదేశం ఆహింసనే పరమోన్నత ధర్మంగా భావిస్తుంది. ‘బ్రతుకు-బ్రతుకనివ్వు’ అన్నదే మన ధర్మం. కాన కాల ప్రవాహంలో మన సంస్కృతి సంప్రదాయాలను ఎన్నింటినో ఏటిపాలు చేసి పాశ్చత్య సంస్కృతిని ఆదర్శంగా గ్రహిస్తూన్నాము. దేవుడి పేరుపై జంతువులను సైతం ఆచరించే ీధీనావస్థకు మన దిగజారిపోయాం! కూటి కోసమే కాక అనేక ప్రేతభావాలతో జంతుహింస మరియయు నరహింసను చేబూనినాము. చివరకు భారతదేశంలో గోహత్య కూడా ఊపందుకుంది. ఇది ఎంతటి అనాచారం! ప్రతీరోజూ అనేక జీవాలను మన తిండి కోసం హతం చేస్తున్నాం. జంతువులు మనలాంటి ప్రాణులన్న విషయయాన్నే విస్మరించాము. జంతువులు మరియు పక్షులు సైతం మనలాగే ఈ భూమిపై జీవించే అధికారాన్ని కలిగి ఉన్నాయి కదా! జంతు హింసను మాని, మాంసాహరాన్ని మనం వీడినట్లయితే, వేల యజ్ఞాలు చేసిన వారమై పరమేశ్వరకటాక్షాన్ని పొందగలము. కావున మన బారతీయ ఆచార సంప్రదాయానికి విరుద్దమైన జీవహింసాత్మక చర్యలకు స్వస్తి చెప్పి, శాఖాహరులమై మన పెద్దల వాక్కును అనసిరించి జీవిద్దాం. - అహింసే పరమో ధర్మ: 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: