ముస్లింలకు ‘రంజాన్’ పవిత్ర మాసం!

ఖుర్‌ఆన్‌ నిర్దేశాలను అనుసరించి రంజాన్‌ నెలలో నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి ఉపవాస వ్రతం అరంభమై నెలంతా కొనసాగుతుంది. భక్తికి, త్యాగాలకు మారుపేరు రంజాన్‌. ఏడేళ్ల బాలుడు మొదలుకొని వృద్ధుల వరకు ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతా రు. ఈసమయాల్లో మసీదులు భక్తులతో కిటికిట లాడుతాయి. ఈ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేపడితే మిగతా సంవత్సరమంతా అదే సేవా భావం అలవడుతుందని వారి నమ్మకం. పవిత్రమైన రంజాన్‌ మాసంలో ముస్లింలు పగ లంతా కఠిన ఉప వాసం చేస్తారు.

ఈ ఉపవా సాన్నే 'రోజా' అంటారు. నెలరోజుల ఈ దీక్షను ఒక శిక్షణగా పవిత్ర ఖుర్‌ఆన్‌ అభివర్ణించింది.సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజా అంటే ఉపవాసం అని తెలిసిందే. సూర్యుడు ఉదయించకముందే సహర్‌తో ప్రారంభమయ్యేదే రోజా. వేకువజాము నే ముస్లీంలు ఉపవాస దీక్ష ప్రారంభించే ముందే భోజనం చేస్తారు. అనంతరం నియ్యత్‌ దువా 'అన్‌ఉజ్‌మో ఘదన్‌ లిల్లాహి మిన్‌కుల్లే రంజాన్‌' చదివి రోజా ఉంటున్నట్లు భగవంతునికి సందేశమిస్తారు. 

అబద్దాలు చెప్పడం, సంగీతం వినడం, దుర్భాషలాడటం, ఎదుటివారి మనస్సు నొప్పించడం, టీవీలు, ఆశ్లీల చిత్రాలు చూడడం వంటి పనులకు దూరంగా ఉంటారు. ఇవి రోజా నిబంధనలకు విరుద్ధం.  సుమారు 14 గంటలపాటు రోజా ఉన్న అనంతరం ఖర్జూర పండ్లతో ఇఫ్తార్‌ చేస్తారు. రోజాను విరమించడాన్నే ఇఫ్తార్‌ అంటారు. రోజా విరమించడానికి దూవ 'అల్లాహుమ్మ ఇన్ని లకాసంతు వా బికామంతు వాలిక తవ్వకల్‌తు అలారిస్కిఖ ఇఫ్తార్‌తు ఫతాతే ఖబ్బిల్‌ మిన్‌హి బిస్‌మిల్లా ' అని ఖర్జూరతో రోజా వదులుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: