తమిళనాడులో సంక్రాంతి సందడి ఏడాది మొదటిలోనే మొదలైపోయింది..!

KSK
సంక్రాంతి పండుగ అనగానే తెలుగు రాష్ట్రాలలో బంధువుల మేళ మరియు గంగిరెద్దుల గోల తో పాటు సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. దేశంలో సంక్రాంతి పండుగ ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో ఎంతగానో సంతోషంగా జరుపుకుంటారు ప్రజలు.


అయితే ఇదే ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా వైవిధ్యంగా జరుపుకుంటారు. తాజాగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సందడి ఇటీవల కొత్త సంవత్సరం వచ్చిన తొలిరోజే ప్రారంభమైంది.


అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 60 ఎద్దులు పరుగులు పెడుతుంటే, వాటిని అదుపు చేసేందుకు 300 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. రేపు విరుద్ నగర్ జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి.


కాగా, జల్లికట్టు కారణంగా జంతువులను హింసించరాదని, పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా వెల్లడించారు. సుప్రీంకోర్టు నిబంధనలను మీరకుండా జల్లికట్టు జరుపుకోవచ్చని అన్నారు. మరోపక్క ఆంధ్ర ప్రాంతంలో కోడిపందాల గురించి ప్రభుత్వాలు మరియు ప్రజల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: