గోవు పరమ పవిత్రం - గోవు వలన ప్రయోజనాలు

గోవు అంటే – గోమాత (ఆవు), గోపిత (ఎద్దు) ఇంకా వాని పిల్లలు దూడలు.  ఇవి అన్ని కలిపి గో సంతతి. కేవలము ఆవులను రక్షిస్తే చాలదు. గోసంతతిని అంతా మనము కాపాడుకోవాలి. ఎందుకంటే గోసంతతితోనే మనకు ఆర్థికము , ఆరోగ్యము, ఆనందము.  గోవు అంటే మూపురము ఉన్న మనదేశపు ఆవు. ఇటువంటి ఆవునే మన పూర్వీకులు గోమాత అని పిలిచారు. మరి మూపురము గేదెకు, ఒంటెకు కూడా ఉన్నది. కానీ మన పూర్వీకులు మూపురము ఉన్న ఆవుని మాత్రమే మాతా అన్నారు. ఇంకా ఇతర జంతువులకు వేటికి కూడా మాతా స్థానము ఇవ్వలేదు.


ఆవుకు వుండే కొన్ని సహజమైన లక్షణాలు:  


1.ఆవు మేస్తున్నప్పుడు సహజముగా గడ్డి కొనలని మాత్రమే తింటుంది. అది సాత్వికమైనది.  అందువలన ఆవు నుంచి వచ్చే గోమయము, గో మూత్రము, గోవు పాలు కూడా సాత్విక మైనవి ఇంకా రోగములను తగ్గించే గుణములు కల్గివున్నవి. 

2. ఆవు ఆహారము తీసుకొనే విషయములో పాటించే నియమము. ఆవులు రాత్రి గడ్డి తినవు. 

3. యజమాని లేక గోపాలన చేసే వారు బాధలో ఉంటే అవికూడా బాధపడతాయి. ఆహారము తీసుకోవు. 

4. పేరుపెట్టి పిలిస్తే స్పందిస్తాయి.  

5. ఎన్ని ఆవులు వున్నా దూడ తన తల్లిని గుర్తుపడుతుంది. 

6. అధిక వేడిని, అధిక చల్ల ధనాన్ని తట్టుకొంటాయి. 

7. బసవన్నలు (ఎద్దులు) యజమాని కి పొలము పనులలో అన్ని విధాలా సహకరిస్థాయి. 

8. ఆవు దూడ పుట్టిన గంటలోపే లేచి పరుగెడుతుంది. పనిలో, ఆచరణలో వేగము వాటికి పుట్టి నప్పటినుండే వస్థాయి. 

గోవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. గోవు నుంచి వచ్చే మూత్రం సేవించడం వలన కాలేయ పనితీరు మెరుగు పడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలకు విషాన్ని హరించే గుణం ఉంది.


గోవు వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:


1. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. ఆవు నెయ్యి మేధస్సును వృద్ధి చేస్తుంది.


2. ఆవు నెయ్యితో హోమం చేయడం వలన వాతావరణంలో ఉన్న క్రిములు చనిపోతాయి. పర్యావరణ పరిరక్షణలో గోవుపాత్ర ఎంతో ఉంది.


3. గోవుని ప్రతి నిత్యం పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవు వృష్ట భాగంలో బ్రహ్మ, మెడలో విష్ణువు ముఖాన శివుడు, రోమ రోమాన మహర్షులు, దేవతలు నివశిస్తారు.


4. అంతేకాక ఆవుపేడలో అష్టలక్ష్ములు కొలువుంటాయి. ఆవు పాలు తల్లి పాల కన్నా శ్రేష్టమైనవి. ఇవి పలచగా ఉండి కొవ్వు తక్కువుగా ఉండటం వలన శరీర బరువుని నియంత్రిస్తాయి.


5. ఉదర సంబంధమైన జబ్బులను తగ్గించడంలో ఈ పాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆవు పాలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో కెఫిన్  అనే ఎంజైము ఉండటం వలన పాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ ఆవు పాలను ప్రతి రోజు తాగడం వలన వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: