రామాయణంలోని ఈ పాత్ర మహా భారతంలో శకుని పాత్ర వంటిది.

Sirini Sita
శ్రీరాముడి కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించేలా రామావతార ముఖ్య ఉద్దేశాన్ని సాధించడంలో రామాయణంలోని ఓ మూడు స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి. వారిలో ప్రథమ స్థానం కైకేయిది, ఆమెకు ప్రేరేపించిన మంథరది ద్వితీయ స్థానం. మంథర ప్రేరణతోనే రాముడి పట్టాభిషేకానికి కైకేయి విఘాతం కలిగించి అరణ్య వాసానికి పంపడంలో విజయం సాధించింది. ఇక మూడో వ్యక్తి శూర్పణఖ. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు పంచవటిలో రుషులతో కలిసి వేదశాస్త్రాల గురించి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాడు. 


ఈ సమయంలో శ్రీరామచంద్రుని కవ్వించి రాక్షస సంహారానికి బీజం వేసింది శూర్పణఖ. దండకారణ్య స్థిత సమస్త రాక్షసుల చావునకు, ఖరదూషణల ఈమె మరణానికి కారణభూతమైంది. అక్కడ నుంచి లంకకు చేరి ఆ నిప్పును అక్కడ అంటించడమే కాదు, సీతాదేవిపై తన అన్న రావణుడికి వ్యామోహం కలిగేలా చేసింది. రావణుని పంచవటికి రప్పించి, సీతను అపహరించేలా చేసి చివరకు రవాణా సంహరణకు కారణం అయంది.


అసలు శూర్పణఖ అంటే ఎవరో చూద్దామా ఆమె అసలు పేరు మీనాక్షి.. కేకసి, విశ్రావసుల కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర దూషణలకు శూర్పణఖ  సోదరి. మారీచ, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యజ్జిహ్యుడనే రాక్షసుడు శూర్పణఖను వివాహం చేసుకున్నాడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు 'తెలియక తప్పు జరిగిపోయిందని' ఓదార్చాడు. మనసు కుదుట పాడించేయందుకు  ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెల్లదీస్తుంది.


రావణ సంహారమే రామాయణమైతే, శ్రీరాముడు రఘవీరుడైంది రాక్షస సంహారంతోనే ఇదంతా శూర్పణఖ వల్లే జరిగింది. ఒక్క తాటికి, సుబాహు తప్ప మిగతా వారి మరణానికి కారణమైంది. అంతేకాదు వారికి అభివృద్ధి కూడా తోడ్పడింది ఆమే. ఎలా అంటే విభీషణస్తు ధర్మాత్మా అంటూ మొట్టమొదటి సారిగా రాముడి వద్ద విభీషణుడి పేరును ప్రస్తావించి, ఆయనపై శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది కూడా ఈ మీనాక్షే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: