ధోనికి మరో తలనొప్పి వచ్చి పడ్డదా..!

shami
మహింద్ర సింగ్ ధోనికి మరో కొత్తరకం సమస్య ఎదురయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీమిండియాకు కేవలం కొన్ని ఫార్మెట్స్ కే కెప్టెన్ గా ఉంటూ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న ధోనికి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఇంతకీ ధోని ఏం చేశాడని అతనికి రవాణా శాఖ వార్నింగ్ ఇచ్చింది అంటే.. వివరాలు ఇలా ఉన్నాయి..  


ధోని దాదాపు 6,7 సంవత్సరాలుగా హమ్మర్ వెహికల్ వాడుతున్నాడు. అయితే తమ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం కేవలం ధోని ఆ వాహనానికి సంబంధించి 2 సంవత్సరాలు మాత్రమే ట్యాక్స్ కట్టాడని.. దాదాపు 5 సంవత్సరాల నుండి ట్యాక్స్ కట్టట్లేదని ఆరోపించారు అధికారులు. అయితే ధోని ఇన్ని సంవత్సరాలుగా ట్యాక్స్ కట్టకుండా ఉండటానికి మరో కారణం ఏంటంటే ధోని హమ్మర్ వాహనాన్ని రవాణా శాఖ వెబ్ సైట్ లో స్కార్పియోగా పేర్కొన్నారట టైపిస్ట్.  


సో టైపిస్ట్ నిర్వాకం వల్ల ధోని వాడేది హమ్మర్ వెహికల్ అయితే స్కార్పియోగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. హమ్మర్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఆ టైపిస్ట్ కు ఆ విషయం తెలియక పోవడంతో అలా జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ధోని తన ట్యాక్స్ మొత్తాన్ని క్లియర్ చేసుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు.


రాంచి డి.టి.ఓ తెలిపిన సమాచారం ప్రకారం ధోని 5 సంవత్సరాల నుండి తన వాహనానికి ట్యాక్స్ కట్టడం లేదని తేలింది.. మరి ఈ విషయం పట్ల ధోని ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం టి-20 ప్రపంచ కప్ లో విరాట్ కొహ్లి నేతృత్వంలో ధోని మ్యాచ్ ఆడటం జరుగుతుంది. ఈరోజు చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగనుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: